మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ముందు నుంచి జోరుమీదున్న బీజేపీకి 10 గంట‌ల ట్రెండ్స్ కాస్త షాక్ ఇచ్చాయి. మ‌హారాష్ట్ర‌లో 108 సీట్ల‌లో ఆధిక్యంలో ఉన్నా శివ‌సేన స‌పోర్ట్ లేనిదే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే ప‌రిస్థితి లేదు. ఇదిలా ఉంటే హ‌ర్యానాలో ప‌రిస్థితి ఒక్క‌సారిగా రివ‌ర్స్ అయ్యింది. అక్కడ ముందు బీజేపీ కూట‌మిలో ఉన్నా ప‌రిస్థితి ఒక్క‌సారిగా రివ‌ర్స్ అయ్యింది. హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏ పార్టీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కన్పించడం లేదు.


భారతీయ జనతా పార్టీ హర్యానాలో 39 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 29 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ఇతరులు 22  స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఇతర పార్టీ నేతలు కీలకంగా మారనున్నారు. ఏదేమైనా మ‌నోహ‌ర్ లాల్ ఖట్ట‌ర్ ప్రభుత్వం ఇక్క‌డ ఫెయిల్ అయ్యింద‌నే విశ్లేష‌కులు చెపుతున్నారు. ముందు నుంచి బీజేపీ 75 సీట్లు గెలుచుకుని మ‌ళ్లీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌ని చెపుతున్నా ఫ‌లితాలు మాత్రం అందుకు పూర్తిగా రివ‌ర్స్ అయ్యాయి.


బీజీపీ ఇక్కడ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవన్నది స్పష్టమవుతుంది. కౌంటింగ్ సరళి నువ్వా? నేనా? అన్నట్లు కొనసాగుతోంది. హర్యానాలో మాత్రం బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది. ఇదిలా ఉంటే అక్క‌డ ఫ‌లితాలు రివ‌ర్స్ అవ్వ‌డంతో బీజేపీ వెంట‌నే రంగంలోకి దిగింది. క‌ర్నాట‌క త‌ర‌హాలో కాంగ్రెస్ చౌతాలా పార్టీకి సపోర్ట్ చేసేందుకు రెడీ అవుతోంది.


చౌతాలా మ‌న‌వ‌డు దుష్యంత్ చౌత‌లాకు సోప‌ర్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే చౌతాలా జేజేపీ 11 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. ఇక అటు అమిత్ షా  వెంట‌నే రంగంలోకి దిగి అక్క‌డ ఇండిపెండెంట్ల‌తో పాటు జేజేపీని త‌మ వైపున‌కు తిప్పుకునే ప‌నిలో ప‌డింది. సాయంత్రానికి హ‌ర్యానా ఫలితంపై క్లారిటీ రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: