హుజూర్ నగర్ ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు.  తొమ్మిదో కౌండ్ పూర్తయ్యే సరికి 16,495 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ  మొత్తం పోలైన ఓట్లు రెండు లక్షల 754 ఓట్లు. మొదటి మూడు రౌండ్లలో నేరేడుచర్ల మండలం రిజల్ట్స్, 4,5 రౌండ్లలో పాలకవీడు మండలం ఓట్ల లెక్కింపు,   6,7,8 రౌండ్లలో మంఠపల్లి మండలం ఓట్ల లెక్కింపు, 9,10,11 రౌండ్లలో మేళ్ల చెరువు ఓట్ల లెక్కింపు, 12,13 రౌండ్లు చింతలపాలెం, 14,15,16,17,18 కౌండ్లలో హుజూర్ నగర్ కౌంటింగ్, 19,20,21,22 రౌండ్లలో గరిడే పల్లి మండల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.


ఇక టీఆర్ఎస్ అభ్య‌ర్థి శానంపూడి సైదిరెడ్డి సొంత మండ‌లం అయిన మ‌ఠంప‌ల్లిలో ప్ర‌స్తుతం కౌంటింగ్ జ‌రుగుతోంది. ఇక టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ అభ్య‌ర్థి గ‌ట్టి పోటీ ఇస్తామ‌ని అనుకుంటున్న టైంలో ఆ పార్టీ అభ్య‌ర్థి పూర్తిగా చేతులు ఎత్తేశారు. తనకు ఓటమి తప్పదన్న అంచనాకు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి, కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఇక కాంగ్రెస్ శ్రేణులు సైతం పూర్తిగా డీలా ప‌డ్డాయి. ఇక కౌంటింగ్ మొత్తం 22 రౌండ్ల‌లో జ‌ర‌గ‌నుంది. ఇక బీజేపీ, టీడీపీ ఘోర‌మైన ఓట‌మి మూట‌క‌ట్టుకోనున్నాయి.


ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో టీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ త‌ప్ప‌ద‌ని అంద‌రూ భావించినా ఓట‌ర్లు మాత్రం ఆ పార్టీకే వ‌న్‌సైడ్‌గా ఓట్లు వేసి ఘ‌న‌విజ‌యం క‌ట్ట‌బెట్టారు. ఓవ‌రాల్‌గా కౌంటింగ్ పూర్త‌య్యే స‌రికి సైదిరెడ్డికి 50 వేల ఓట్ల పై చిలుకు మెజార్టీ వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీంతో సైదిరెడ్డి, టీఆర్ఎస్‌ మద్దతుదారులు సంబరాలు ప్రారంభించారు. తాను ముందుగా చెప్పినట్టుగానే బంపర్ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకోనున్నానని ఈ సందర్భంగా సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: