ఎన్నికల భాగంగా నామినేషన్ తేదీ మొదలు ఎన్నికలు జరిగి., ఓట్లు లెక్కించి., ఫలితాలు వచ్చేవరకు కూడా ప్రతిరోజూ పండుగ రోజే అనడంలో అతిశయోక్తి లేదు.. ప్రియతమ నాయకులు గెలిస్తే ఒక సంతోషం., ఓడితే ఇంకొక తీరు., ప్రతిపక్ష నేతలు., అధికార పార్టీలు., మా నాయకుడు., మీ పార్టీ అంటూ చేసే రాజకీయంలో ఉండే మజా నే వేరు.. ఇప్పుడు ఇలాంటి మజా హర్యానా., మహారాష్ట్రలలో మంచి జోరులో ఉంది.. ఈ మధ్య జరిగిన మహారాష్ట్ర., హర్యానా., అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలుసుకునేందుకు ఓట్ల లెక్కింపు నేడు జరుగుతున్న సంగతి తెలిసినదే..  

 

 

అయితే నేటి సోమవారం జరిగిన మహారాష్ట్రలోని 288, హర్యానాలోని 90 స్థానాల పోలింగ్ ఫలితాలతో పాటుగా 16 రాష్ట్రాలు., ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడనున్నాయి. వీటితోపాటు మహారాష్ట్ర లోని సతారా., మధ్యప్రదేశ్ లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది.. అయితే జాతీయ మీడియా సంస్థలు వెలువరించిన ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని తేల్చేశారు. ఇండియా టుడే, యాక్సిస్‌ మై ఇండియా సర్వే వారు మాత్రం హర్యానాలో కొద్దిగా విరుద్ధంగా ఎగ్జిట్‌ పోల్స్‌ను తెలుపడంతో ఆ రాష్ట్ర ఫలితాలపై కాస్త ఉత్కంఠ పెరిగింది.

 

 

ఇండియా టుడే., ఎగ్జిట్ పోల్ సర్వే వారు మహారాష్ట్ర లోని 288 అసెంబ్లీ స్థానాలలో బీజేపీకి దాదాపు 166 నుంచి 194 వరకు., కాంగ్రెస్ కు 72 నుంచి 90 వరకు., ఇతరులకు 22 నుంచి 34 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు.. ఇక టైమ్స్ నౌ సర్వే ప్రకారం హార్యానా లో ఉన్న 90 స్థానాలలో బీజేపీ కి 71., కాంగ్రెస్ కు 11., ఇతరులకు 8 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.. గత సంవత్సరం బీజేపీ., బీజేపీ కూటమి సాధించిన ఫలితాల కంటే కూడా ఈసారి మరిన్ని సీట్లు బీజేపీ కైవసం చేస్కోబోతున్నట్లుగా ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సర్వే ని బట్టి మనకు తెలుస్తుంది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: