ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగుస్తున్న బీజేపీ. తమ కమలాన్ని రోజు రోజుకు తాజాగా విరిసేలా చేస్తుంది. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి తిరుగులేదని నిరూపిస్తూ వేగవంతంగా ముందుకు దూసుకెళ్లుతుంది. ఈ ఆనందమో, లేక దీపావళీకి శుభవార్త తెలుపాలని ఉత్సాహమో కాని మోదీ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్ అందించింది. పెన్షనర్లకు 17 శాతం డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) అందించాలని నిర్ణయించింది. దీంతో డీఆర్ మొత్తం 5 శాతం పెరిగినట్లు అయ్యింది.


ఈ డీఆర్ పెంపు నిర్ణయం 2019 జూలై నుంచే వర్తిస్తుంది. ఇక ఈ ఆఫర్ డిసెంబర్ వరకు అమలులో ఉంటుందని తెలిపింది.. ఇకపోతే ఇప్పుడు వచ్చే పెన్షన్ మొత్తం రూ.450 నుంచి రూ.6,250 మధ్యలో పెంపు నిర్ణయం తీసుకోవడం వల్ల పెరుగుతుంది. ఇక ఏడవ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వం  డియర్‌నెస్ రిలీఫ్‌ను గరిష్ట స్థాయిలోనే పెంచింది. దీనికి సంబంధించి ఆర్డర్లు కూడా వెలువడ్డాయి అని ఏజీ ఆఫీస్ మాజీ ప్రెసిడెంట్ హరిశంకర్ తివారీ తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వం 2017కు ముందు, 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేసింది.


అప్పటినుండి మినిమమ్ ఫ్యామిలీ పెన్షన్ నెలకు రూ.9,000గా ఉంది. అలాగే పరిహార మొత్తాన్ని డబుల్ చేశారు. రూ.10.15 లక్షల నుంచి రూ.25.35 లక్షలకు పెంచారు. ఇకపోతే ఇప్పుడు డీఆర్ 5 శాతం పెంపు వల్ల వీరి పెన్షన్ రూ.450 పెరుగుతుందని తివారీ తెలిపారు. అలాగే రూ.1.25 లక్షల పెన్షన్ తీసుకునే వారికి పెన్షన్ మొత్తం రూ.6,250 పెరుగుతుందని పేర్కొన్నారు.. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి డియర్‌నెస్ అలవెన్స్ 5 శాతం పెరగడంతో, ఇప్పుడు డీఏ 17 శాతానికి ఎగసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతం రూ.900 నుంచి రూ.12,500 మధ్యలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే దీపావళికి ప్రవేశపెడుతున్న ఈ నిర్ణయంతో చాలా మందికి ప్రయోజనం కలుగనుందని పేర్కొంటున్నారు...


మరింత సమాచారం తెలుసుకోండి: