గత అసెంబ్లీ  ఎలక్షన్ లలో  పోటీ చేసిన కాంగ్రెస్ ఘోర  పరాజయాన్ని మూటగట్టుకుంది. అటు పార్లమెంట్ ఎలక్షన్లో ఇటు తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ లో కాంగ్రెస్ చతికిలబడి ఇప్పటికే   పరాజయం పాలైన విషయం తెలిసిందే . అయితే తాజాగా హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి గత  ఎలక్షన్ లో గెలిచిన ఉత్తంకుమార్ రెడ్డి ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పోటీ చేయడంతో అక్కడ కూడా విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు ఉత్తంకుమార్ రెడ్డి. దీంతో హుజూర్నగర్ అసెంబ్లీ లో ఉప ఎన్నిక అనివార్యం అవ్వగా... తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి పద్మావతి రెడ్డి బరిలోకి దింపారు. 

 

 

 

 

 అయితే అటు తెరాస కూడా గత ఎలక్షన్లలో స్వల్ప తేడాతో ఓటమి పాలైన సైదిరెడ్డి మరోసారి అవకాశం కల్పించింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ రెండు పార్టీలు హోరాహోరీ ప్రచారం కూడా చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఈ నెల 21న జరగ్గా  ఎన్నికల ఫలితాలు నేడు  విడుదల అవుతున్నాయి. అయితే హుజూర్నగర్ ఫలితాలలో మొదటి నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి సైది రెడ్డి ఆధిక్యంలో  కొనసాగుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హై స్పీడ్ తో విజయ్ తీరాల వైపు దూసుకు పోతున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి,  ఉత్తమ్ పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. 

 

 

 

 

 అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఓటమితో తెలంగాణలో కాంగ్రెస్ మరింత దిగజారింది. గత ఎన్నికల్లో గెలుచుకున్న సిట్టింగ్ స్థానాన్ని కూడా  ఆ పార్టీ కాపాడుకోలేక పోయింది. ఏకంగా పార్టీ అధ్యక్షుడు అయినా ఉత్తమ్ తన  భార్యను రంగంలోకి దింపినప్పటికీ  కూడా ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా అప్పట్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్లలో  ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవికి  రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారని అందరూ అనుకున్నారు . కానీ ఆయన కాకుండా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు  వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు రాజీనామా చేశారు.  కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఉత్తం కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వర్గాలుగా విడిపోయి సీనియర్లు అందరూ ఉత్తమ్ కుమార్ వైపు,  మరికొందరు రేవంత్ రెడ్డి వర్గం వైపు వున్నారు. అయితే టీపీసీసీ పదవిపై కన్నేసిన ఎంపీ రేవంత్ రెడ్డి ఆ దిశగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ కి  కంచుకోట లాంటి హుజూర్నగర్ నియోజకవర్గంలో... తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యుండి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేక పోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ పదవికి రాజీనామా చేస్తే బెటర్ అని పలువురు భావిస్తున్నారు. కాగా తుది ఫలితాలు వెల్లడయ్యాక  ఏక్షణంలోనైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసే అవకాశాలున్నాయనే  వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: