రాజకీయం అంటే అదే మరి ఎగిరిపడినంతసేపు ఉండదు,కిందపడడానికి, అపుడు నేలచూపులు చూసినా బేలగా విలపించినా కూడా లాభం లేదు, కాంగ్రెస్ ముక్త భారత్ అని భారీ ఎత్తున ప్రచారం చేసిన బీజేపీకి ఇపుడు అదే కాంగ్రెస్ చుక్కలు చూపిస్తోంది. అయిదు నెలల క్రితం కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్న వారంతా ఇపుడు కిక్కురుమనడంలేదు. దేశంలో రెండు కీలకమైన రాష్ట్రాల్లో బీజేపీకి రివర్స్ గేర్ ఫలితాలు వస్తున్నాయి.


మోడీ, షాల మ్యాజిక్ ఇపుడు చెల్లడంలేదనడానికి మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు చూస్తే అర్ధమైపోతుంది. అయిదు నెలల క్రితం బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఇపుడు కనువిప్పు కలిగేలా రెండు రాష్ట్రాల ఫలితాలు ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెస్ కనీసం పెద్దగా ప్రచారం కూడా చేయకపోయినా కూడా జనం ఆదరిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. అదే కాంగ్రెస్ కష్టపడి ఉంటే ఇక అక్కడ బీజేపీకి అసలైన కధ ఏంటో తెలిసేదని కూడా అంటున్నారు.


పోయినసారి ఎన్నికల్లో మహారాష్ట్రలో  సింగిల్ గా 122 సీట్లు సాధించిన  బీజేపీ ఇపుడు మహారాష్ట్రలో 90 సీట్ల వద్దనే ఆగిపోయింది. అప్పట్లో 40 సీట్ల వరకూ దక్కించుకున్న కాంగ్రెస్ కు ఇపుడు 90 వరకూ సీట్లు రావడం అంటే చాలా గొప్పగా పుంజుకున్నదని చెప్పాలి. అదే ఎన్సీపీ విషయానికి వస్తే 51 స్థానలల్లో దూసుకుపోతోంది. 


మరో వైపు శివసేన తన పాత స్థానాలను నిలబెట్టుట్తుకునేలా ఉంది. ఇక హర్యానా విషయానికి  వస్తే రెండవసారి కూడా అధికారం ఖాయమనుకున్న బీజేపీకి హంగ్ బూచి బెదిరిసొతంది. ఇపుడున్న ట్రెండ్స్ బట్టి చూస్తూంటే బీజేపీ అక్కడ కేవలం 40 సీట్లు మాత్రమే సాధించింది. ఇక కాంగ్రెస్ 30 సీట్ల వరకూ  ఆధిక్యతతో దూసుకుపోతోంది. ఇక్కడ బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి. మొత్తం మీద చూసుకుంటే ఈ ఎన్నికల ఫలితాల  ట్రెండ్స్ బట్టి చూస్తూంటే కాంగ్రెస్ మళ్ళీ రీచార్జి అయినట్లుగా అనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: