హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేలా ఉంది. రౌండ్ రౌండ్ కు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికి ఆధిక్యత పెరుగుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హుజూర్ నగర్ ఫలితం ఎలా ఉంటుందా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూశారు. కానీ ఆర్టీసీ సమ్మె ప్రభావం టీఆర్ఎస్ పార్టీపై ఏ మాత్రం పడలేదని హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితం నిరూపించబోతుంది. 
 
హుజూర్ నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల షెడ్యూల్ మొదలుకొని పోలింగ్ వరకు అన్ని విషయాల్లో విఫలమైందని అందువలనే కాంగ్రెస్ పార్టీ హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఓటమిపాలవుతోందని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీని హుజూర్ నగర్ లో గ్రూపు రాజకీయాలు కూడా దెబ్బ తీశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సొంత నేతలు కొందరు ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రభుత్వంపై వ్యతిరేకతను ఓట్లుగా మలచుకోవటంతో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెబుతున్నారు. 
 
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి దిశగా పయనిస్తూ ఉండటంతో ఆ పార్టీ నేతలలో అంతర్మథనం మొదలైందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. మూడవ స్థానంలో బీజేపీ పార్టీ ఉండగా తెలుగుదేశం పార్టీ నాలుగో స్థానానికి పరిమితమైంది. టీడీపీ, బీజేపీ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. 
 
టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి బంపర్ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ స్ కార్యకర్తలు, సైదిరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన పోలింగ్ లో 7 మండలాల్లోని 302 పోలింగ్ కేంద్రాల్లో 2,00,754 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో 28 మంది పోటీ పడ్డారు. సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కేసీయార్ వెంటే ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: