చంద్రబాబుకు షాకులు అలా ఇలా తగలడం లేదు. తగుదునమ్మా అంటూ తలదూర్చిన ప్రతీసారి గట్టిగానే దెబ్బలు పడిపోతున్నాయి. తెలంగాణాలో టీడీపీ పుట్టింది. ఇక్కడ మళ్ళీ మేము వస్తామంటూ తాజాగా చెబుతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి దిగిన టీడీపీకి ఇపుడు అక్కడ డిపాజిట్ అయినా దక్కుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. కారు జోరుకు కాంగ్రెస్ కే షాక్ తగులుతూంటే ఇక బీజేపీ, టీడీపీ సంగతి చెప్పనక్కరలేదని అంటున్నారు.


ఇక్కడ చావా  కిరణ్మయిని  టీడీపీ తన అభ్యర్ధిగా ప్రకటించింది. పేరుకు పోటీ పెట్టింది కానీ ప్రచారం కోసం కూడా బాబు అక్కడికి పోలేదు, మొత్తం తెలంగాణా నేతల మీదనే బాధ్యతను వదిలేశారు. మరో వైపు చూస్తే ఇక్కడ కారు జోరు మామూలుగా లేదు, మొత్తానికి మొత్తం అన్ని రౌండ్లలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీయే ఆ పరుగు అందుకోలేకపోతోంది. పాతిక వేల ఓట్ల మెజారిటీ టీయారెస్ కి వస్తుందని అంటున్నారు. ఇక మూడవ స్థానంలో బీజేపీ వస్తుందని అంటున్నారు. నాలుగవ స్థానం టీడీపీకి మిగిలింది  అంటే డిపాజిట్ గల్లంతే అంటున్నారు.


తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయని తెలుగుదేశం హుజూర్ నగర్ లో మాత్రం పోటీకి పెట్టింది, ఇది ఏపీ సరిహద్దు ప్రాంతం కావడంతో పాటు టీడీపీ సామాజిక వర్గానికి చెందిన 20 వేల పై చిలుకు ఓట్లు తమకు అనుకూలంగా ఉంటాయని ఆశపడింది,  గట్టి పోటీ ఇవ్వవచ్చునని భావించింది. చివరకి ఆ ఓట్లు కూడా కారు పార్టీ పట్టుకుకుపోతూండడంతో ఇక్కడ టీడీపీ సైకిల్ కి డిపాజిట్లు దక్కక చతికిలపడుతుందా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏకపక్షంగా టీయారెస్ కి ఇక్కడ ఓట్లు పడిన నేపధ్యంలో బాబు గారి పార్టీకి డిపాజిట్లు దక్కవని అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: