హరియాణాలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా, నేనా అన్నట్టుగా సాగుతున్న పోరులో ఇప్పటికే హరియాణాలో బీజేపీ విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. కాని ఏం జరుగుతుందో చివరివరకు తెలియని పరిస్దితులు ఇప్పుడు తలెత్తాయి. ఇకపోతే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికలు కావడంతో ప్రతివారిలో ఉత్కంఠ నెలకుంది. మహారాష్ట్రలో శివసేనతో జట్టుకట్టిన బీజేపీ 164 చోట్ల బరిలో నిలిచింది. మిత్రపక్షం శివసేన 124 స్థానాల్లోనూ పోటీ చేసింది. ఇకపోతే ఓ వైపు ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే మహారాష్ట్రలో తమ మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు.


తమ పార్టీ 100 స్థానాల్లో విజయం సాధిస్తుందని రౌత్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇక్కద ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్‌లను ముందుగా లెక్కిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నానికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇక రెండు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇక మహారాష్ట్ర ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక్కడ ఎంఐఎం పార్టీ మూడు చోట్ల ఆధిక్యత ప్రదర్శిస్తోంది. మొత్తం 59 స్థానాల్లో ఆ పార్టీ తన అభ్యర్థులను రంగంలోకి దింపగా, ఔరంగాబాద్ ప్రాంతంలో ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.


ఇక 90 స్థానాలున్న హరియాణాలో ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. ఇక్కడ బీజేపీ 38, కాంగ్రెస్ 30, జేపేపీ 10, ఇతరులు 12 చోట్ల ఆధిక్యంలో ఉండగా. హరియాణా ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగడంతో మాజీ ఉప-ప్రధాని చౌదరి దేవీలాల్ తనయుడు దుష్యంత్ సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీకి కీలకంగా మారింది. ఇక జేజేపీకి కాంగ్రెస్ పార్టీ ఏకంగా సీఎం పదవి ఇస్తామని ఆఫర్ కూడ ఇచ్చింది. ఇకపోతే గతంలో కర్ణాటక ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాన్ని కాంగ్రెస్ ఇక్కడ అనుసరిస్తోంది. ఇకపోతే మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్ ఓట్లకు ఎంఐఎం భారీగా గండికొట్టింది. ఆ పార్టీ అభ్యర్థులు గణనీయంగా ఓట్లను దక్కించుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థులపై తీవ్ర ప్రభావం చూపింది...


మరింత సమాచారం తెలుసుకోండి: