మహారాష్ట్రలో బీజేపీకి కి మిత్రపక్షంగా ఉంటూనే ఇప్పుడు షాక్ ల మీద షాక్ లు ఇచ్చే శివసేన మరోసారి అదిరిపోయే షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ బిజెపి.. శివసేన మీద ఆధారపడక తప్పని పరిస్థితి వచ్చిన నేపథ్యంలో శివసేన బీజేపీపై భారీ డిమాండ్ పెడుతోంది. మహారాష్ట్రలో బీజేపీ- శివసేన కూటమి మేజిక్‌ ఫిగర్‌ దాటేసింది. 288 స్థానాలున్న అసెంబ్లీలో 145 మేజిక్ ఫిగర్‌. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే శివసేనపై బీజేపీ పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.


ఓ వైపు ఫ‌లితాలు వెలువుడ‌తోన్న వేళ శివ‌సేన ఫైర్‌బ్రాండ్‌, ఆ పార్టీ ఎంపీ సంజ‌య్‌రౌత్ త‌మ‌కు సీఎం పీఠం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. మేజిక్‌ ఫిగర్‌ 144 కాగా… బీజేపీ 102 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. శివసేన 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూట‌మి 90 స్థానాల్లో ఆధిక్య‌లో ఉండ‌గా.. ఇత‌రులు 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ కంటే ఎక్కువుగా మిత్ర‌ప‌క్ష‌మైన ఎన్సీపీ 50కు పైగా సీట్ల‌లో ఆధిక్యంలో ఉంది.
శివ‌సేన షాకింగ్ డిమాండ్‌:  సీఎం పీఠంతో పాటు ప‌ద‌వులు 50-50 ఇవ్వాలి.....


ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన సింపుల్ మెజార్టీ సాధించినప్పటికీ శివసేన లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని నడపలేదని సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక రాహుల్ గాంధీ లాంటి వాళ్లు రాజ‌కీయాల్లో ఉండాల‌ని కూడా ఆయ‌న గ‌తంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.


ఇక త‌మ‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వితో పాటు ప‌ద‌వుల్లోనూ 50 - 50 ఇవ్వాల‌ని సైతం ఆయ‌న ఇప్ప‌టికే డిమాండ్లు మొద‌లు పెట్టేశారు. దీంతో మహారాష్ట్ర‌లో అప్పుడే ఉత్కంఠ ప‌రిణామాలు మొద‌ల‌య్యాయి.ఇక శివ‌సేన డిమాండ్ల‌తో బీజేపీలో అప్పుడే టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: