ఉబర్ యాప్ ఉంటే చాలు మెట్రో రైల్ లో ప్రయాణించడం చాల ఈజీ. ఉబర్ బుక్ చేసుకుంటే టికెట్ కొనకుండానే మెట్రోలో ప్రయాణించవచ్చు. అదెలా సాధ్యమనేగా మీ సందేహం. అయితే వినండి..ఇంటి నుంచి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లే ప్రయాణికులు.. ఇకపై అదే యాప్‌తో మెట్రో రైళ్లలో కూడా ప్రయాణించవచ్చు. దీనికి ప్రత్యేకంగా టోకెన్, స్మార్ట్ కార్డు అవసరం లేదు. జస్ట్ మెట్రో స్కానర్ దగ్గర క్యూర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు… నేరుగా ప్లాట్‌ఫాంపైకి వెళ్లి రైలు ఎక్కవచ్చు. మెట్రో రైల్ ఇప్పటికే నగరవాసుల ప్రయాణ సమయాన్ని చాలా వరకు తగ్గించింది. దాదాపుగా 50-75% ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ఎల్.బి.నగర్ నుండి మియాపూరు వరకు 29 కిలో మీటర్లు దూరం. మొత్తం స్టేషన్లు 27. ప్రయాసమయము 45 నిముషాలు పడుతుంది.



జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా వరకు 15 కిలోమీటర్ల దూరం. మొత్తం స్టేషన్లు 16. ప్రయాణ సమయం 22 నిముషాలు పడుతున్న విషయం తెలిసిందే. నాగోలు నుండి శిల్పారామం వరకు దూరము 28 కిలో మీటర్లు. మొత్తం స్టేషన్లు 23. ప్రయాణ సమయము 30 నిముషాలు. మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రాంతాలలో వెలసే అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 50 వేల మందికి ఉద్యోగవకాశాలు. సురక్షిత ప్రయాణం అతి సమర్థవంతంగా తక్కువ శక్తిని మరియు స్థలమును వినియోగిస్తుందని నిరూపించబడింది. పైగా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. శబ్ద కాలుష్యాన్ని కూడా తగిస్తుంది. అంతే కాకుండానే రోడ్డు రవాణాతో పోలిస్తే ఒక ప్రయాణీకుడికి 50% తక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఈ తరుణంలో ఉబర్ సదుపాయం మరింత సౌకర్యవంతంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 




ఇక జర్నీ ముగిసిన తర్వాత ఎగ్జిట్ గేట్ దగ్గర కూడా మళ్ళీ క్యూర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఇంతే సింపుల్.ప్రముఖ క్యాబ్ బుకింగ్ సంస్థ ఉబెర్ భారత్‌లో మరో కొత్త సర్వీసుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ప్రైవేట్ క్యాబ్ సర్వీసులు మాత్రమే ఉన్న ఈ యాప్‌లో త్వరలోనే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి రానుంది. అందుకు అనుగుణంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌తో ఉబర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే ఈ ఫీచర్‌ను ఢిల్లీ మెట్రో అధికారులతో కలిసి లాంచ్ చేసిన ఉబర్.. త్వరలోనే యూజర్లకు ఇది అందుబాటులోకి రానుందని తెలిపింది. దీని ద్వారా ఉబర్ క్యాబ్‌‌లో ప్రయాణించేవారికి.. ప్రయాణం మరింత సులభతరం కానుంది. అక్కడ నుంచి కావాలంటే క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా ఇల్లు లేదా ఆఫీస్‌కి వెళ్లిపోవచ్చు. కాగా, ఈ జర్నీకి అయిన మొత్తం డబ్బును మనం గమ్యస్థలం దగ్గర చెల్లించవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: