దేశ‌వ్యాప్తంగా వెలువ‌డుతోన్న ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎగ్జిట్‌పోల్స్‌కే అంద‌ని విధంగా వ‌స్తున్నాయి. మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానాలో బీజేపీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని... ఇక్క‌డ పోరు వ‌న్‌సైడ్‌గా ఉంటుంద‌ని అంద‌రూ అంచ‌నా వేస్తుంటే... ఫ‌లితాలు ఇందుకు రివ‌ర్స్‌లో వ‌స్తున్నాయి. ఇక ఈ క్ర‌మంలోనే త‌మిళ‌నాడులోనూ అంద‌రి అంచ‌నాల‌కు భిన్న‌మైన ఫ‌లితాలు వ‌స్తున్నాయి. తమిళనాడులో మంచి జోరుమీదున్న డీఎంకేకు బ్రేకులు పడ్డాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార అన్నా డీఎంకేను గట్టి దెబ్బకొట్టిన స్టాలిన్‌కు ఉప ఎన్నికలో ఎదురుదెబ్బ తగిలింది.


రాష్ట్రంలోని నంగునేరి, విక్రవండి అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు చోట్ల డీఎంకే చాలా సులువుగా గెలుస్తుంద‌ని అంద‌రూ భావించారు. అయితే అందుకు భిన్నంగా ఈ రెండు స్థానాల్లో అధికార పార్టీ అన్నా డీఎంకే ఆధిక్యంలో ఉన్నట్లు నేటి ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న ట్రెండ్స్ బ‌ట్టి చూస్తే ఈ రెండు స్థానాల్లో అన్నాడీఎంకే గెలవడం లాంఛనమే అన్నట్లు కనిపిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 39 ఎంపీ స్థానాలున్న తమిళనాడులో 22 స్థానాలు డీఎంకే గెలుచుకుంది. కాగా, ఉప ఎన్నికలో కూడా డీఎంకే గెలుస్తుందని చాలా వరకు రాజకీయ విశ్లేష‌కులు భావించారు.


అయితే ప‌రిస్థితి మాత్రం పూర్తి రివ‌ర్స్ అయ్యింది. ఇప్పుడు అన్నాడీఎంకే దూసుకు పోతోంది. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతి త‌ర్వాత అనేక రాజకీయ డ్రామాల తర్వాత పట్టు నిలుపుకున్న అన్నాడీఎంకేకు ఈ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు జీవం పోసేలా ఉన్నాయి. మ‌రి ఇదే ఊపుతో 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ గెలుస్తారా.. ఓపీస్-ఈపీఎస్ (పన్నీర్ సెల్వం-పళనిస్వామి) నిలుస్తారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్న స్టాలిన్‌కు ఫ‌లితాలుల నిరాశ క‌లిగించ‌డంతో డీఎంకే శ్రేణులు సైతం కాస్త షాక్‌లోనే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: