అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఒకింత షాక్ త‌గిలింది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతుండ‌గా...అదే స‌మ‌యంలో ఆ పార్టీకి ఊహించ‌ని షాకులు త‌గులుతున్నాయి. శివసేన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఆ పార్టీ ఎంపీ సంజయ్‌రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి శివసేనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిగిలిన మంత్రి పదవులు సగం, సగం పంచుకోవాలని తెలిపారు. ఈ విషయం తాను పార్టీ అధినేత ఉద్దవ్ థాకరేతో సమావేశమై చర్చించనున్నట్లు వెల్లడించారు.
 
మ‌రోవైపు, యువసేన చీఫ్‌ ఆదిత్య థాకరే(28) క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేప‌థ్యంలో ఈ ప్ర‌తిపాద‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆదిత్య వర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో బీజేపీ కూటమి ముందంజలో ఉంది. 288స్థానాలకు గాను ఇప్పటివరకు 189స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుంది. నాగ్ పూర్ నుంచి బరిలోవున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ భారీ ఆధిక్యంలో ఉన్నారు. 103 స్థానాల్లో బీజేపీ, 68 స్థానాల్లో శివసేన, కాంగ్రెస్ 41 స్థానాల్లో, 49 స్థానాల్లో ఎన్సీపీ, ఇతరులు 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 


ఇఇలాఉండ‌గా, అయితే మహారాష్ట్రలో బీజేపీ నేతలు ససేమిరా తాము తప్ప ఎవరికీ అధికారం దక్కే చాన్సే లేదని బల్లగుద్దిమరీ చెబుతున్నారు. కౌంటింగ్ కూడా స్టార్ట్ కాకుండానే బుధవారం సాయంత్రమే సంబరాలకు సిద్ధమైపోయారు. ముంబైలోని పార్టీ ఆఫీసులు లడ్డూలు తయారు చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే కార్యకర్తలు, నాయకులు తియ్యని వేడుక చేసుకునేందుకు రెడీగా ఉన్నామని చెబుతున్నారు. తమ విజయం విషయంలో తిరుగులేదంటున్నారు. ఇప్పటికే పార్టీ ఆఫీస్ దగ్గర కార్యకర్తల హాడావుడి నెలకొంది. ఈ స‌మ‌యంలో శివ‌సేన ప్ర‌తిపాద‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: