అతడు  చదివింది ఏమో ఏడో తరగతి..కానీ  విప్రోలో టీం లీడర్‌గా పని చేస్తున్నట్లు అందరికి మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. అతని వేష భాషలతో కనికట్టు చేస్తాడు అందరిని. తన కున్న  పలుకుబడితో సాప్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి  మోసాలు చేస్తున్న ఓ యువకుడిని గోపాలపురం పోలీసులు  అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ఇలా అతడు  కరీంనగర్‌ జిల్లా, వావిలాలపల్లికి చెందిన రిషిరెడ్డి అలియాస్‌ హరీష్‌ 7వ తరగతి వరుకు మాత్రమే చదువు కున్నాడు.


ఇక జల్సాలకు బాగా అలవాటు పడిన హరీష్‌ 2016 లోనే ఇంట్లో నుంచి బయటికి వచ్చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి పలువురు ప్రముఖులు, మంత్రులు, వీఐపీలతో ఫొటోలు దిగుతూ వాటిని అందరికి  చూపిస్తూ  అమాయకులను మోసం చేసేవాడు. తాను విప్రో కంపెనీలో టీం లీడర్‌గా పనిచేస్తున్నానని ప్రచారం చేసుకునే వాడు. తనకు  విప్రోతో పాటు ఇంకా  సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో పెద్ద జీతంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి వారి నుంచి రూ.లక్షలు వసూలు చేస్తుండే వాడు. 


గత కొన్ని రోజులుగా  కరీంనగర్, నిజామాబాద్, ఎల్లారెడ్డి, గోదావరిఖని ప్రాంతాల్లో దాదాపు 50 మందిని ఇలాగె మోసం చేస్తున్నాడు. ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఆరుగురు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేసుకోవడం జరిగింది. ఇక గత జూలైలో హైదరాబాద్‌కు వెళ్లడం జరిగింది  హరీష్‌ సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌బజార్‌లోని గణేష్‌ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. అక్కడ హోటల్‌ నిర్వాహకుడు సురేష్‌తో పరిచయం పెంచుకున్న అతను అతని బంధువులకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి విప్రో కంపెనీకి తీసుకెళ్లాడు. వారిని కింద ఉంచి పైన ఉండే కార్యాలయంలోకి వెళ్లి వస్తానని చెప్పి పోవడం జరిగింది. తర్వాత నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇచ్చి  వారి నుంచి రూ.4 లక్షలు తీసుకోవడం జరిగింది.


బయటికి పోయి వస్తానని చెప్పి అక్కడి నుంచి పరారు అవ్వడం జరిగింది. దీంతో అనుమానం వచ్చిన బాధితులు కంపెనీకి వెళ్లి విచారణ జరపగా ఆ  పేరుతో ఎవరూ పనిచేయడం లేదని తెలిపారు. అతడు ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ కూడా నకిలీది అని తెలిపారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. బుధవారం బాధితుల సమాచారం మేరకు ట్యాంక్‌బండ్‌ నిందితుడు హరీష్‌ను విచారించడం జరిగింది


మరింత సమాచారం తెలుసుకోండి: