మహారాష్ట్ర, హర్యానా లోనే కాదు... తెలంగాణలోని బిజెపికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా త‌మ పార్టీ దూసుకుపోతుందని చెల‌రేగుతున్న‌ బిజెపి నేతలకు హుజూర్ నగర్ ఓట‌రు చుక్కలు చూపించారు. హుజూర్‌ నగర్ లో బిజెపి కారు జోరు జోరుకు కుదేలైంది. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన కోట రామారావు ఘోరమైన ఓటమి మూటకట్టుకోవడంతో పాటు పార్టీ పరువు సైతం ఘోరంగా ఖ‌ల్లాస్‌ అయింది. బిజెపికి హుజూర్నగర్ ఉప ఎన్నిక ఓ పీడ‌క‌ల‌ మిగిల్చింది.


ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ మొదటి స్థానంలో .. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా.. స్వతంత్ర హెల్మెట్ గుర్తు అభ్యర్థి మూడో స్థానంలో ఉన్నారు. బీజేపీ 4వ స్థానానికి పడిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉండి మొన్నటి ఎంపీ ఎన్నికల్లో సత్తాచాటిన బీజేపీకి ఇంతకంటే ఘోర అవమానం లేదని టీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. విశేషం ఏంటంటే కాంగ్రెస్ కు కంచుకోటలైన  మట్టపల్లి, నేరేడు జర్ల మండలాల్లోనూ టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది.


ఇక బీజేపీ నాలుగో స్థానంలో ఉంటే హెల్మెట్ గుర్తు ఉన్న ఇండిపెండెంట్ అభ్య‌ర్థికి ఏకంగా 1400 ఓట్లు వ‌చ్చాయి. టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల త‌ర్వాత హెల్మెట్ గుర్తు ఉన్న ఇండిపెండెంట్ అభ్య‌ర్థి సుమ‌న్‌కు ఈ రేంజ్‌లో ఓట్లు రావ‌డంతో బీజేపీ నేత‌లు షాక్ అవుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే బీజేపీ 1500 ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడు అంతే ఓట్లు కూడా రావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ‌డంతో బీజేపీకి ఈ ఉప ఎన్నిక ఘోర‌మైన అవ‌మానం మిగిల్చిన‌ట్ల‌య్యింది.


ఈ ఓట్లుతో షాక్ తిన్న‌ బీజేపీ అభ్యర్థి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి గెలిచినట్టుందని.. తనకు అంత తక్కువ ఓట్లు రావడం నమ్మశక్యంగా లేదని.. దీనిపై విచారణ జరపాలని కోరడం విశేషం. ఏదేమైనా హుజూర్‌న‌గ‌ర్ రిజ‌ల్ట్‌తో బీజేపీ శ్రేణుల నోర్లు పెగ‌ల‌డం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: