ఎన్నికలు అనేవి రాష్ట్ర భవిష్యత్తును మార్చేవి గా ఉండాలి అని ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి నాయకుడు కూడా ఇలానే ప్రచారం చేస్తూ పోటీ చేస్తారు.ఇప్పుడు   మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమి రాకెట్ కంటే స్పీడ్ గా దూసుకుపోతున్నారు. మొత్తం 288 స్ధానాలకు గాను బీజేపీ కూటమి 120 స్ధానాల్లో ఆధిక్యంలో సరవేగంగా దంచేస్తున్నారు. యూపీఏ 42 స్ధానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు మూడు స్ధానాల్లో ఆధిక్యం చూపుతున్నారు.

 

ఇక మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ నాగపూర్‌లో ప్రత్యర్ధిపై భారీ ఆధిక్యంలో గెలుపు ఖాయం దిశగా వెళ్తున్నారు. కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ బొకార్‌ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు.

 

ఎన్నికల్లో చాలా చాలా స్పీడ్ ప్రచారం అంతే స్పీడ్ గా ఎన్నికలు జరగడం ఫలితాల రోజు కూడా రానే వచ్చింది.దాంతో ఈ పొద్దున నుండి కూడా కొనసాగుతున్న లెక్కింపులో  శివ సేన,బీ.జే.పి అత్యంత వేగంగా పుంజుకుంటుంది.మరో పక్క కాంగ్రెస్ కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో చాలా వేగంగా పుంజుకుంటుంది.అయితే అందరి దృష్టి శివసేన కూటమి మీదనే ఉంది.

 

విజయం మాదంటే మాది అని చాలా ధీమాగా ఉన్నారు అన్ని పార్టీల నాయకులు మరి కొంత సేపట్లోనే ఖచ్చితంగా విజయం ఎవరికి వరించనున్నదో క్లారిటీ అవ్వనుంది.దాంతో ఆల్రెడీ విజయం తమదే అని దేవేందర్ ఫడ్నవిష్ పండగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు.కాంగ్రెస్ నాయకులు కాస్త వెనుకంజ లో ఉన్నా కూడా ఖచ్చితంగా గెలుపు తలుపు తెరిచేది మేమే అన్నట్లు తమ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకొస్తున్నా విజయం దిశగా మాత్రం బీ.జే.పి దూసుకుపోతుండటం కొంత టెన్షన్ కి గురి చేస్తుంది అని వాళ్ళ వాళ్ళ ముఖాల్లో స్పష్టం గా తెలుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: