జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మీద తెగ రెచ్చిపోయేవారు. సభల్లోనే జగన్ ను భూతులతో తిట్టిన రికార్డు కూడా ఈయన గారికే ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. జగన్ సీఎం అయిపోయారు. అనంతపురంలో జేసీ కొడుకు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు జేసీకి చెందిన సుమారు 34 బస్సులను ఏపీ ప్రభుత్వం సీజ్ చేసింది. మరో మూడు నెలల పాటు బస్సులు తిరగకుండా సీజ్ చేసింది. ఇదంతా గతంలో జేసి .. జగన్ మీద నోరు పారేసుకోవటం వల్లేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ మావాడే నని జేసి మీడియా ముందుకు వచ్చి చెప్పినా జగన్ మాత్రం జేసి మీద కసి తీర్చుకుంటున్నారు. 


అయితే రాయలసీమలో ముఖ్యంగా అనంతపురంలో మంచి పట్టు ఉన్న నేతగా పేరు పొందిన జేసిదివాకర్ రెడ్డి .. తనను బీజేపీలోకి లాగడానికి ఆ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎందుకో జేసి బీజేపీలోకి చేరాలంటే వెనకడుగు వేస్తున్నారు. ఏపీలో ఇప్పటి వరకు బీజేపీకి కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఆ పార్టీలోకి పొతే ఒరిగేదేమి లేదని జేసి భావించవచ్చు. అయితే జేసి ఫ్యామిలీ వైసీపీ పార్టీ వైపు ఆసక్తిగా చూస్తున్నా .. జగన్ మాత్రం వీరిని పట్టించుకోవటం లేదు. 


అయితే ఇప్పటికే టీడీపీ పార్టీ నుంచి నాయకులూ వేరే పార్టీలకు జంప్ అయ్యారు. టీడీపీకి ఉన్న ఆర్ధిక మూల స్థంభాలైన నలుగురు రాజ్య సభ ఎంపీలు బీజేపీలోకి వెళ్లిపోయిన సంగతీ విధితమే. దీనితో టీడీపీ పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ఎన్నికల ముందు టీడీపీ మునిగిపోయే నావ అని కొంత మంది ముందుగానే అర్ధం చేసుకొని వైసీపీలోకి వెళ్లిపోయారు. టీడీపీలో ఉండిపోయిన నేతల పరిస్థితి ఘోరంగా తయారైంది. దీనితో ఇప్పుడు ఈ నేతలు టీడీపీలో ఉండి తప్పు చేశామని ఆఫ్ ది రికార్డు చర్చించుకుంటున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: