మహారాష్ట్ర, హరియాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవ్వడానికి వస్తుంది మరికొన్ని గంటల్లో పూర్తిస్దాయి ఫలితాలు వెలువడే అవకాశం వుంది.. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల ఉప-ఎన్నికల కౌంటింగ్ కూడా సాగుతోంది. ఇకపోతే మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసినా ఫలితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఇండియటుడే-యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసినట్టుగానే హరియాణాలో ఫలితాలు ఉన్నాయి.


ఇక్కడ హంగ్ దిశగా సాగడంతో జేజేపీ మద్దతు కీలకంగా మారింది. ఇకపోతే ప్రస్తుతం ఎవరెన్ని స్దానాల్లో ఉన్నారో తెలుసుకుంటే, గుజరాత్‌లోని ఆరు స్థానాలకు గానూ మూడు బీజేపీ, మూడు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి.తొమ్మిదో రౌండ్ పూర్తయ్యేసరికి వర్లీలో శివసేన అభ్యర్థి ఆదిత్య థాక్రే 9,900 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బారామతి నుంచి పోటీచేసిన ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పొవార్ లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పోలైన ఓట్లలో 80 శాతం ఆయనకు దక్కగా, అక్కడ పోటీచేసిన ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు.


హరియాణాలో అధికార బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఓటర్లు విలక్షణ తీర్పునివ్వడంతో ఆ పార్టీ కేవలం 40 లోపు స్థానాలకే పరిమితమయ్యింది. దీంతో బీజేపీ హరియాణా చీఫ్ సుభాష్ బర్లా తన పదవికి రాజీనామా చేశారు. బీహార్‌లోని జరిగిన ఉప-ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సత్తా చాటింది. కిషన్‌గంజ్ స్థానంలో బీజేపీ అభ్యర్థిపై 11 వేల మెజార్టీతో ఎంఐఎం అభ్యర్థి విజయం. ఒడిశాలోని బైజేపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప-ఎన్నికలో బీజేడీ విజయం సాధించింది. ఇక్కడ బీజేడీ అభ్యర్థి రీతు సాహు దాదాపు లక్ష ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక ఇప్పటివరకు అత్యంత ఆసక్తితో సాగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన మబ్బులు క్రమక్రమంగా వీడనున్నాయి. మరి కొద్ది గంటల్లో రాజకీయ గంట మోగించేది ఎవరో తేలనుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: