దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మహారాష్ట్ర హర్యానా ఎన్నికలతో పాటు 18 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా నిర్వహించబడ్డాయి. అయితే నేడు హర్యానా మహారాష్ట్ర ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. కాగా  దేశం చూపు మొత్తం హర్యానా మహారాష్ట్ర ఎన్నికలపైనే ఉంది. ఈ రెండు రాష్ట్రాలలో  ఎవరు అధికారాన్ని చేజిక్కించుకున్నారు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఫలితాలు నేడు వెలువడగా...  మొదటినుంచి బిజెపి ఆధిక్యతను  సాధిస్తూ వచ్చింది. ఆ తర్వాత మాత్రం  మహారాష్ట్రలో బీజేపీ ఆధిక్యం సాధించినప్పటికీ హర్యానాలో మాత్రం మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోలేకపోయింది బిజెపి పార్టీ. 

 

 

 

 దీంతో మహారాష్ట్రలో బీజేపీ అధికారాన్ని సొంతం చేసుకున్నప్పటికీ... హర్యానాలో బిజెపి అధికారాన్ని సొంతం చేసుకోవడానికి వేరే పార్టీ మద్దతు కోరాల్సి వచ్చేలా ఉంది. దీంతో హర్యానా ఫలితాలు బీజేపీ పార్టీ పెద్దలను  నిరాశ కలిగించాయనే   చెప్పాలి. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా. అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది బిజెపి. అయితే 90 అసెంబ్లీ స్థానాలకు గాను 46 మ్యాజిక్ ఫిగర్ ఉండగా... మ్యాజిక్  ఫిగర్  ను చేరుకోలేకపోయింది బిజెపి. ప్రస్తుతం ఇతరులను కలుపుకుంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో కనిపిస్తుంది బీజేపీ. 

 

 

 

 అయితే అటు కాంగ్రెస్ కూడా బిజెపికి గట్టి పోటీ ఇచ్చింది ఏకంగా 30కి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. దీంతో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇండిపెండెంట్ ఇతర పార్టీల మీద ఆధారపడాల్సి  వస్తోంది. అయితే హర్యానాలో బిజెపి ఫలితాలకు బాధ్యత వహిస్తూ హర్యానా బిజెపి అధ్యక్షుడు సుభాష్ బరాల  తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా  కు పంపించారు. ఇదిలా ఉండగా హర్యానా ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా వెలువడడంతో... జేజేపీ  పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. 10 స్థానాలు జేజేపీ  పార్టీ గెలవడంతో... బిజెపి కాంగ్రెస్ ఈ రెండు పార్టీలలో జేజేపీ  పార్టీ ఏ పార్టీకి మద్దతు తెలిపిన ఆ పార్టీ   హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది . ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ కి సీఎం పదవి ఆఫర్ చేశారట కాంగ్రెస్ పార్టీ. మరి చివరగా హర్యానాలో జేజేపీ  పార్టీ మద్దతు సంపాదించుకుని ఏ పార్టీ ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేస్తుందో  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: