దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా మహారాష్ట్ర హర్యానా ఎన్నికలతో పాటు 18 రాష్ట్రాల్లో  64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. కాగా ఈ నెల 21న ఈ ఎన్నికల కౌంటింగ్ మొదలు పెట్టి  ఫలితాలను  విడుదల చేస్తున్నారు . అయితే మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో మొదట భారీ ఆధిక్యత నమోదు చేసిన బిజెపి పార్టీ... మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ ని  దాటేసింది కానీ హర్యానాలో  మాత్రం మ్యాజిక్ ఫిగర్  చేరుకోలేకపోయింది బిజెపి పార్టీ. దీంతో హర్యానాలో హగ్  తప్పేలా  లేదు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలన్ని  ప్రతిష్టాత్మకంగా జరిగాయి. 18 రాష్ట్రాల్లో జరిగిన ఈ  ఉప ఎన్నికలు  ప్రభుత్వ పాలనకు నిలువుటద్దంగా మారినున్నాయి.  

 

 

 

 అయితే గుజరాత్ లో  జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్ తగిలినట్టు  కనిపిస్తుంది . అక్కడ 6 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగగా నాలుగు చోట్లా కాంగ్రెస్ పార్టీ ఏ ముందంజలో ఉంది... రెండు చోట్ల మాత్రం బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. రాదన్  పూర్ లో బీజేపీ కీలక నేత అయినా అల్పేష్ ఠాగూర్  కూడా... ఉప ఎన్నికల్లో వెనుకబడడం  బిజెపి శ్రేణులకు చేదు వార్త అనే చెప్పవచ్చు. గుజరాత్ లోని ధారాడ్, అమరాయివాడి, బయాద్, రాధన్ పూర్ లలో   కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. లూనవాడ, ఖేరాల  లలో   బిజెపి అభ్యర్థులు  ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో  కేవలం కొన్ని వందల ఓట్ల ఆధిక్యంలో ఉండగా... బిజెపి అభ్యర్థుల మాత్రం తాము ఆధిక్యంలో  ఉన్న స్థానాల్లో వేల సంఖ్య ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

 

 

 

 అయితే కాంగ్రెస్ నాలుగు నియోజకవర్గాల్లో  1500, 150,4500,  760 ఇలా కొన్ని వందల ఓట్ల ఆధిక్యంలో మాత్రమే ఉండగా ... అయితే బిజెపి అధికారంలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో 29000, 12807 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా నాలుగు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో  కొనసాగుతుండగా   కొన్ని వందల ఓట్ల తేడానే ఉంది కాబట్టి ఏ క్షణంలోనైనా ఫలితాలు మారే అవకాశముందని రాజకీయా విశ్లేషకులు భావిస్తున్నారు . ఇదిలా ఉండగా తెలంగాణలో కూడా ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగగా... ఆ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ... టిఆర్ఎస్ సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: