రికార్డు స్థాయి మెజార్టీతో హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించినందుకు....టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం, టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... భారీ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని, పని చేసే ప్రభుత్వానికి ఇదో టానిక్ లాంటిదని అన్నారు కేసీఆర్. తాము మరింత ఉత్సాహంతో పని చేసేందుకు ప్రజలు తమని బలపరిచారని చెప్పారు. 


ప్రతిపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. ప్రజలు ఆలోచించి ఓటు వేశారని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు తమపై ఇటీవల చాలా నిందలు వేశారని, అయినా గత ఎన్నికల్లో 7 వేల తేడాతో ఓడిపోయిన ఆ సీటును ఇప్పుడు ప్రజలు 43 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారని చెప్పారు. ఇది టీఆర్ఎస్ 50 వేల మెజారిటీ సాధించినట్లు లెక్కఅని అన్నారు. ఈ ఉప ఎన్నికలో గెలిచినా ఓడినా ప్రభుత్వమేమీ మారేది లేదని చెప్పారు.


హుజూర్‌న‌గ‌ర్ ప్ర‌జ‌ల విష‌యంలో...కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  హుజూర్‌నగర్ ప్రజల త‌మ‌పై ఏ భ‌రోసా, ఆశలు, నమ్మకాలు పెట్టుకుని టీఆర్‌ఎస్‌ను గెలిపించారో వందశాతం వాళ్ల కోరికలు తీర్చుతామని సీఎం పేర్కొన్నారు. ఎన్నికల‌ ప్రచార సమయంలో వర్షం వల్ల తన సభ రద్దవడంతో హుజూర్ నగర్ రాలేకపోయానని తెలిపిన కేసీఆర్ 26వ తేదీన‌ హుజూర్ నగర్ వెళ్లి ప్రజలకు థ్యాంక్స్ చెబుతానని అన్నారు. అక్కడికక్కడే ప్రజల ఆశయాల మేరకు ప్రకటన చేస్తానని చెప్పారు. హుజూర్ నగర్లో సాగునీటి సమస్య ఉందని తెలిపిన కేసీఆర్ ``సాగర్ ఆయకట్లు రైతుల ఇబ్బందుల్ని పరిష్కరిస్తాం. ప్రజల ఆశలు నెరవేరుస్తాం` అని భ‌రోసా ఇచ్చారు. కేసీఆర్ టూర్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: