సాధారణంగా ఎవరైన ఏదైన పోటీ పెట్టి బహుమతులు ప్రకటిస్తారు. లేదా డ్రాలో పేరు వచ్చిన వారికి నజరానా ఇస్తారు. కాని ఓ కలెక్టర్ మాత్రం ఓ విషయంలో ఓపెన్ ఛాలెంజ్ చేసారు. ఇంతకు ఈ ఛాలెంజ్ చేయడం వెనుకున్న ఉద్దేశ్యం మాత్రాం చాలా మంచిదే. ఎందుకంటే సరైన ఆలోచనలేని, అర్ధంలేని మూఢాచారలలో సమాజం మగ్గిపోతుంది. ఈ ఆచారాల చాటున కొందరైతే ప్రాణాలు తీసుకుంటున్నారు, ఎదుటివారి ప్రాణాలు కూడా తీస్తున్నారు.


ఇక దేశంలో ప్రతి మూడు రోజుల్లో ఒక రోజు ఒక చేతబడి మరణం సంభవిస్తున్నదని 2016 జూన్‌లో చేపట్టిన ఒక సర్వే వెల్లడించింది. ఇదిగో ఇలాంటి ఆలోచనలకు అడ్డుకట్ట వేద్దామనే నడుం బిగించి తన ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. అందులోని భాగమే ఎవరైన దెయ్యాన్ని చూశారా? ఒక వేళ చూసి ఉంటే ఆధారాలతో సహా వచ్చి నాకు చూపిస్తే రూ.50 వేలు నగదు బహుమతి గెలుచుకోవచ్చు అని విసిరిన ఛాలెంజ్ ఇది.. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా  దెయ్యాలు, పిశాచాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై స్పందించిన కలెక్టర్.. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు..


ఇకపోతే చేతబడులు చేస్తున్నారని, మనుషులకు దెయ్యం పట్టిందనే నెపంతో మూఢులూ, మూఢత్వం నుండి బయటకు రాలేక, ఇతరులను దారుణంగా హింసిస్తూ, వారి ప్రాణాలు తీస్తున్నారు. దయచేసి ఇలాంటి మూఢ విశ్వాసాలను నమ్మవద్దని చెబుతున్నానని పేర్కొన్నారు. ఇకపోతే ఇప్పుడు ఒడిశాలోని గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ అమృత కులాంగే చేసిన ఈ ప్రకటన ఆ రాష్ట్రంలో చర్చనీయంగా మారింది. ఏది ఏమైనకాని గాని మూఢాచారాలను అరికట్టాలనే ఉద్దేశంతో కలెక్టర్ చేసిన ఈ ప్రకటనతో నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆలోచన సంపూర్ణంగా ఫలించాలని ఆశిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: