ఒకప్పుడు శివసేన పార్టీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్లో  రాజ్‌థాక్రే ఒకరు. పార్టీ బలోపేతం అయినప్పుడు ఆయన ఎంతో ప్రభావం చూపారు. అప్పట్లో తన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకొని మహారాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమయిన ముద్ర వేసుకున్నారు. కానీ శివసేన నుంచి బయటకు వచ్చి సొంత కూటమి ఏర్పరిచాక పెద్దగా ప్రభావం చూపడం లేదు.

తాజాగా వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) పార్టీ అంతగా  ప్రభావం చూపలేదు. 110 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒక్క చోట మాత్రమే తన ఆధిక్యాన్ని చూపించారు.మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల్లలో బీజేపీ,శివసేన కూటమి దూసుకుపోతుండగా, కాంగ్రెస్‌,ఎన్సీపీ కూటమి వెనుకబడింది. రాజ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సే ఘోరంగా విఫలం  అయ్యారు.

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎస్‌ పోటీ చేయకపోయినప్పటికీ, బీజేపీ వ్యతిరేకంగా రాజ్‌ ఠాక్రే ప్రచారం నిర్వహించారు,కానీ అప్పుడు కూడా ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 48 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ-శివసేన కూటమి  42 చోట్ల గెలిచి సత్తా చాటింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపై విరుచుకుపడ్డారు.మహారాష్ట్ర ఎన్నికల్లో దాదాపు అన్ని ప్రధాన పార్టీలు రెండు  అంకెల స్థానాల్లో దూసుకు వెళ్లాయి.తన మాటలతో జనాన్ని ఆకర్షించే నాయకుడిగా ఎదిగిన రాజ్‌ థాక్రే, తన పార్టీని మాత్రం గెలుపు  దరి పట్టించలేకపోయారు.కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యం చూపించింది.. 2006లో శివసేన నుంచి రాజ్ థాక్రే బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టారు.

తర్వాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులు 13 స్థానాల్లో విజయం సాధించగా,2014లో కేవలం ఒక్క స్థానానికే పరిమితం అయ్యారు.ఈసారి కూడా అలాంటి చేదు అనుభవాన్ని ఆ పార్టీ ఎదుర్కొంది. తాజాగా  ఫలితాలతో రాజ్‌ థాక్రే రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు బాల్ థాక్రే తర్వాత నేతగా గుర్తింపు పొందిన ఆయన తన పార్టీని నిలబెట్టుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది అందరికి.


మరింత సమాచారం తెలుసుకోండి: