గన్నవరం నియాజక వర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై కేసు నమోదైంది.. వేల సంఖ్యలో నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారనే ఆరోపణలే ఈ అరెస్ట్ కు కారణం.. అయితే ఇందుకు సంబంధించిన ఫిర్యాదు ను హనుమాన్ జంక్షన్ పోలీసు స్టేషన్లో బాపులపాడు తహశీల్దార్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.. బాపులపాడు తహశీల్దార్ సంతకాన్ని వల్లభనేని వంశీ ఫోర్జరీ చేశారని అతని పై ఫిర్యాదు చేశారు..  

 

వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా., గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికల్లో ఎలా అయినా సరే గెలవాలనే తపన తో వేల సంఖ్యలో ఇళ్ల పట్టాలను తాను పోటీ చేస్తున్న నియోజక వర్గానికి చెందిన బాపులపాడు., కొయ్యురు., కోడూరుపాడు., సహా పలు గ్రామాల్లోని ప్రజలకు వేల సంఖ్యలో నకిలీ ఇళ్ల పట్టాలని పంపిణీ చేశారని... అయితే తాను పంపిణీ చేసిన స్థలాల కాగితాలపై బాపులపాడు మండల తహశీల్దార్ సంతకాలని అతనికి తెలియకుండా కనీసం అతనితో చర్చించకుండా వంశీ ఫోర్జరీ చేసి ప్రజలకు పంపిణీ చేసి ఓట్లను దక్కించుకొని విజయం సాధించేశారు.. కానీ!! ఇందుకు పణంగా ఒక బాధ్యతయుతమైన వృత్తిలో వున్న ఒక ప్రభుత్వాధికారిని వాడుకోవడం కాస్త సిగ్గు చేటు.. అయితే నిజం బయట పడిన రోజున తన ఉద్యోగం పోతుందనే భయంతో వెంటనే వంశీ పై కేసు పెట్టారు..

 

ఓట్లను పొందాలి అంటే దానికి తగ్గ కృషి చేసి సాధించాలి కానీ ఇలా అడ్డ దారిలో., దొంగ మార్గాన దొంగ పనులు చేయడాన్ని ఖండిస్తూ ప్రభుత్వం తగు చర్యలు చెప్పట్టింది.. ఇలాంటి నాయకులు ఉండటం తప్పు కాదు.., కానీ ఇలాంటి నాయకులు పంచే సొమ్ముకు ఆశ పడి రాబోయే తరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్న ప్రజలకు సైతం హెచ్చరికలు జారీ చేసారు.. అయితే ఎన్నికల ముందు వేల సంఖ్యలో తాను పంపిణీ చేసిన నకిలీ ఇళ్ల స్థలాల విషయంలో ఓర్వని పోలీసులు ఫిర్యాదు అందుకున్న వెంటనే వంశీ తో సహా అతని అనుచరుడైన రంగా ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: