తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం టీఎస్ ఆర్టీసీపై విరుచుకు పడ్డారు.  ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం అని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం డిమాండ్ అర్థరహితం అన్నారు. ఇది చిల్లర రాజకీయ యూనియన్ల సమ్మె అన్నారు.  ఇది కేవలం యూనియన్ లీడర్ల స్వార్థం కోసం చేసిన పని..కానీ దానికి బలైంది మాత్రం ఆర్టీసీ కార్మిక సోదరులు అన్నారు.  యూనియన్ ఎన్నికల కోసమే పనికిమాలిన సమ్మెలు చేస్తున్నారని మండిపడ్డారు. 


ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ యూనియన్లపై  ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు. యూనియన్లవి చిల్లర రాజకీయాలు అని మండిపడ్డారు. కనీసం జ్ఞానం ఉన్న వాడు ఎవడూ ఇలాంటి పని చెయ్యడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దసరా, బతుకమ్మ పండుగల సమయంలో సమ్మె చేస్తారా అని నిలదీశారు. ఆ సమయానికి ఆర్టీసికి మంచి రెవెన్యూ వస్తుందన్న విషయం తెలిసిందే. కానీ ఆర్టీసీ పనికట్టుకొని అదే సమయానికి సమ్మే చేయడం వల్ల ప్రజలు ఎన్ని కష్టలు పడ్డారో అందరికీ తెలిసిందే. 

ఇదంతా వారి స్వయంకృత అపరాదం.. ఆర్టీసీ మునగక తప్పదని, ఎవరూ కాపాడలేరని సీఎం తేల్చి చెప్పారు. ఇక ముగిసేది సమ్మె కాదు.. ఆర్టీసీనే ముగుస్తుంది అని సీఎం సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీకి రూ.4వేల 250 కోట్లు ఇచ్చామని తెలిపారు. 2019లో కూడా రూ.425 కోట్లు రిలీజ్ చేశామన్నారు. ఆర్టీసీకి రూ.5వేల కోట్ల అప్పులు ఉన్నాయన్న సీఎం కేసీఆర్..ఆర్టీసీని ఇక ఎవరూ కాపాడలేరని ఆయన ఫైర్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: