జనం వేలం వెర్రిగా వాడేస్తున్న టిక్ టాక్ షోలో వీడియోలు చేస్తూ పాపులర్ అయిపోయిన అందమైన భామా సోనాలీ పొగట్. ఈమెను జనాలకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టిక్ టాక్ షోలో ఆల్‌రెడీ బోల్డంత పాపులారిటీ వచ్చేసింది.. కాబట్టి పార్టీలో చేర్చుకుని సీటిస్తే గెలవడం ఖాయం అని బీజేపి ఆలోచించింది. అందుకే పిలిచి మరీ టికెట్ ఇచ్చేసారు. ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకుగాను బీజేపీ అదంపూర్ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించింది బీజేపి. సోనాలీకి టికెట్ కేటాయిచిన విషయం తెలియగానే ఆమె ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగింది. దీంతో విజయం ఖాయమనుకున్నారంతా,


ఇకపోతే  ఇప్పటివరకు అదంపూర్ స్థానం కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉంది. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ 2000, 2005 ఎన్నికల్లో రెండుసార్లు ఈ స్థానం నుంచి గెలుపొందారు. ఈనేపథ్యంలో సోనాలీ గెలుపుని బలంగా కోరుకుంది బీజేపీ. కాని ఆ విషయం ఇప్పుడు తెలిసినట్లు ఉంది అధికార పార్టీకి. ఎన్నికల్లో గెలవడం అంటే టిక్‌టాక్‌ చేసినంత ఈజీ కాదని సోనాలికి కూడా అర్ధం ఐయ్యి ఉంటుంది. ఇక ఈ విషయాన్ని ఆలస్యంగా అర్ధం చేసుకునే లోపే హరియాణాలోని అడంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఘోర ఓటమి మూటగట్టుకున్నారు..


టిక్‌టాక్‌లో ఆధరించిన వారు ఆమెను ఎన్నికల సంగ్రామంలో ఆదరించలేకపోయారు. ఇకపోతే  సోనాలి పొగట్‌పై విజయం సాధించిన కుల్దీప్ బిష్ణోయ్ ఇప్పటికే మూడుసార్లు అదంపూర్ నుంచి విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు జరిగిన తాజా ఎన్నికల్లో ఆమెపై 30వేల మెజార్టీతో గెలుపొందారు. 50 ఏళ్లుగా అడంపూర్ నియోజకవర్గాన్ని కంచుకోటలా ఏర్పాటు చేసుకున్న బిష్ణోయ్ కుటుంబం కోటను కూల్చాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇక సోనాలికి 30వేల ఓట్లు మాత్రమే రాగా బిష్ణోయ్ కు 64వేల ఓట్లు వచ్చాయి. ఏది ఏమైన రాజకీయచదరంగం అంటే మాటలు చెప్పినంత తేలిక కాదంటున్నారు సోనాలి అపజయాన్ని గమనించినవారు...


మరింత సమాచారం తెలుసుకోండి: