తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఈరోజు ఆర్టీసీ కార్మికులు గత 20 రోజుల నుండి చేస్తున్న సమ్మెపై మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు ఒక పద్ధతి పాడు లేకుండా వ్యవహరిస్తారా అని కేసీఆర్ అన్నారు. ఇష్టం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తాం, ఇష్టం ఉన్నప్పుడు వస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఐదారు రోజులలో నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్ అన్నారు. 
 
ప్రభుత్వం బాధ్యత ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించటం అని అది ఆర్టీసీనా గీర్టీసీనా తనకు అనవసరమని కేసీఆర్ అన్నారు. ఒక్క పర్మిట్ ఇస్తే మెరుగైన రవాణా సౌకర్యం వస్తుందని కేసీఆర్ అన్నారు. ఐదారు రోజుల్లో ఒక్క సంతకంతో నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్ అన్నారు. యూనియన్ ఉచ్చులో పడి ఆర్టీసీ కార్మికులు మీ రక్తం మీరే పీల్చుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. 
 
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అశ్వత్థామరెడ్డి స్పందించారు. ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానం అని కేసీఆర్ చెప్పగా ఎవరు ఎవరికి ముగింపు పలుకుతారో ప్రజలే నిర్ణయిస్తారని అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దురహంకారానికి పరాకాష్ట కేసీఆర్ చేసిన వ్యాఖ్యలని అన్నారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారని అన్నారు. 
 
ఆర్టీసీ యూనియన్ల వలనే ఇంకా బతికుందని అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల కష్టం అని సీఎం కేసీఆర్ అయ్య జాగీరు కాదని అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులదే అంతిమ విజయమని, ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దని అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని ఇలాంటి సీఎంలను చాలా మందిని చూశానని అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులవి గొంతెమ్మ కోరికలు కావని ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యం ఉందని అశ్వత్థామరెడ్డి అన్నారు. కేసీఆర్ కు ఎప్పుడూ ఎన్నికల ధ్యాసే అని అశ్వత్థామరెడ్డి అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: