దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ నియోజక వర్గాలను ఉపఎన్నికలు జరిగాయి.  ఇందులో తమిళనాడుకు కూడా ఒకటి.  తమిళనాడులోని విక్రవండి, నాన్ గురి నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి.  ఈ ఉపఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం సాధిస్తుందని అనుకున్నారు. అంతేకాదు, ఈ ఉప ఎన్నికల్లో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను పోటీకి దించారు.  దీంతో డీఎంకే పార్టీ, ఉదయనిధిని స్టాలిన్ ను గెలిపించుకోవడానికి సర్వశక్తులను ఒడ్డింది.  కానీ, ఉదయనిధి స్టాలిన్ ను తమిళనాడు ప్రజలు తిరస్కరించారు.  


విక్రంవండి, నాన్ గురి నియోజక వర్గాల్లో జరిగిన ఉపఎన్నికల్లో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ విజయం సాధించింది.  2021లో ఎన్నికలు జారబోతున్న తరుణంలో ఈ ఉపఎన్నికల్లో అన్నా డీఎంకే విజయం సాధించడం ఆ పార్టీకి నైతికంగా బలం చేకూరినట్టైంది.  అమ్మ జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకే పార్టీ దిక్కులేనిది అయ్యింది.  పార్టీలో ఎవరికీ పెద్దగా అనుభవం లేదు. పార్టీని నడిపించే సత్తా లేదు.  


పన్నీర్ సెల్వం సీనియర్ అయినప్పటికీ పళనిస్వామి ముఖ్యమంత్రి కావడంతో.. పన్నీర్ సెల్వం కొన్ని రోజులు స్థబ్దతగా ఉన్నారు.  ఆ తరువాత కొన్ని రోజులకు పన్నీర్ సెల్వం, పళనిస్వామి కలిసిపోయారు.  పార్టీని ముందుకు నడిపించేందుకు నడుంబిగించారు.  అయితే, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే పార్టీ భారీ విజయం సొంతం చేసుకుంది. దీంతో అన్నాడీఎంకే పార్టీ పని అయిపోయిందని, వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీనే విజయం సాధిస్తుందని అనుకున్నారు.  


అయితే, ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో డీఎంకే పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇది మాములు దెబ్బకాదు.  బయట అభ్యర్థిని ఎన్నికల్లో నిలబెట్టి ఉంటె.. ఓడిపోయినా పెద్దగా పట్టించుకునేవారు కాదు.  పోటీ చేసింది స్వయానా డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు కావడం.. ఆయన్ను పార్టీ గెలిపించుకోలేకపోవడంతో డీఎంకే పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  మరి దీనిపై డీఎంకే ఎలా స్పందిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: