దేశంలోని 51 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.  కేరళలో 5 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి.   మంజేశ్వర్, ఎర్నాకులం, ఆర్నూర్, కొన్ని, వట్టి యార్కప్ నియోజక వర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి.  ఈ ఉప ఎన్నికల్లో మజేశ్వర్ లో ముస్లిం లీగ్ పార్టీ విజయం సాధించగా, ఎర్నాకులం, ఆర్నూర్ నియోజక వర్గాల్లో సీపీఎం, కొన్ని, వట్టి యార్కప్ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నం చేసింది.  ఈ ప్రయత్నం కొంతమేర ఫలించినట్టు కనిపించింది.  అయితే, ఒక్కసీటును కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది.  కానీ, ఓటు బ్యాంకును మాత్రం గణనీయంగా పెంచుకుంది.  23.1 శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది.  ఇది సీపీఎం, కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు దాదాపుగా దగ్గరగా ఉండటం విశేషం. ఓటు బ్యాంకు పెంచుకోవడంతో బీజేపీ ఆనందంలో ఉన్నది.  


వచ్చే ఎన్నికల నాటికి అక్కడ కొంతమేర బలపడేందుకు బీజేపీకి ఇది ఊతం ఇచ్చినట్టు అయ్యింది. ఇదే ఊపును కేరళలో రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రదర్శిస్తే.. తప్పకుండా అక్కడ పాగా వేసే అవకాశం ఉంటుంది.  ఎప్పటి నుంచో కేరళ ఎర్రకోటలో పాగా వేయాలని బీజేపీ చూస్తున్నా ఫలించడం లేదు. వచ్చే ఎన్నికల్లో అయినా ఆ పార్టీ కేరళలో అడుగుపెట్టాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రయత్నం చేస్తోంది.  


ఇక మహారాష్ట్రలో ఎన్డీయే విజయం సాధించింది.  అయితే, హర్యానాలో మాత్రం ఇంకా వెనకబడి ఉన్నది.  మ్యాజిక్ ఫిగర్ కు 6  స్థానాల వెనుక ఉన్నది. అయితే, ఇంకా కౌంటింగ్ ప్రక్రియ సాగుతున్నది కాబట్టి ఫైనల్ గా వచ్చే రిజల్ట్స్ ను బట్టి ఎవరి మద్దతు తీసుకోవాలి.. ఎన్ని సీట్లు అవసరం అవుతాయి అన్నది మరికాసేపట్లో తేలిపోతుంది.  మరి చూడాలి ఏం జరుగుతుందో.  మహారాష్ట్రలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. పదువులు 50-50 గా పంచుకోవాల్సి ఉన్నది.  చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: