మంత్రి బొత్ససత్యనారాయణకు ఏరోటికాడ ఆపాట పాడటం ముందునుంచీ ఉన్న అలవాటేనని, జగన్‌ మెప్పుపొందడం కోసం, తనమంత్రిపదవిని కాపాడుకోవడం కోసం రాజధానిపై తప్పుడుకమిటీలు వేస్తూ, ప్రజల్ని తప్పుదోవపట్టించే ప్రయత్నాలు చేస్తున్నాడని  తెలుగుదేశం రాజ్యసభసభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ ఎద్దేవాచేశారు. బొత్స కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి మరణంపై అనేకఅనుమానా లున్నాయని, వైఎస్‌ మరణానికి, జగన్‌, ఆయనతల్లి విజయమ్మే కారణమని, రాజశేఖర్‌రెడ్డి మృతిపై విచారణ జరపాలని కోరిన విషయాన్ని రాష్ట్రప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. 

అటువంటి బొత్స రాజధాని అమరావతిపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడన్నారు. రూ. 32వేలకోట్ల అవినీతి జరిగిందని చెబుతున్న బొత్స, అమరావతి నిర్మాణానికి ఎన్నివేలకోట్లు పెట్టుబడి పెట్టారో తెలుసుకోవాలన్నారు. సీఆర్డీఏ స్టేట్‌మెంట్‌ ప్రకారం అమరావతిలో రూ.8వేలకోట్ల పనులు జరిగాయని అధికారికంగా పేర్కొంటే, రూ.32వేలకోట్ల అవినీతి ఎలా జరిగిందో ముఖ్యమంత్రి, మంత్రి బొత్స సమాధానం చెప్పాలన్నారు. 


పాలనచేతగాక, బడ్జెట్‌లో నిధులు కేటాయించలేక, రాష్ట్ర ఆర్థికవ్యవస్థను చక్కదిద్దలేక విఫలమైన వైసీపీప్రభుత్వం, గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని ఎంపీ మండిపడ్డారు. 2017-18లో పన్నులు వసూళ్లు ఎలాఉన్నాయో, ఇప్పుడుఎలా ఉన్నాయో వైసీపీనేతలు ఆలోచించుకోవాలని, వారు ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మాని, అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ఆయన హితవుపలికారు. 25 మంది ఎంపీలను ఇస్తే,  కేంద్రంమెడలు వంచుతానన్న వ్యక్తి, ఢిల్లీచుట్టూ చక్కర్లుకొడుతూ, కేంద్రపెద్దలను కలవడానికి పడిగాపులుపడుతూ, కేంద్రం కాళ్లావేళ్లపై పడే హీనస్థితికి దిగజారాడన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులకు అందాల్సిన రుణాలను వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడం దారుణమని మరో మాజీమంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. నవరత్నాలను సాకుగా చూపుతూ, రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడేలా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నా రు. సంక్షేమాన్ని గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం హయాంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, కాపులకు కేటాయించిన రుణాలను రద్దుచేసిందన్నారు. వివిధవర్గాల సంక్షేమానికి బ్యాంకులకు కేటాయించిన నిధులనుకూడా నిలిపేయడంవల్ల, 2.50లక్షల నుంచి 3లక్షల మంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు యువతకు తీరని అన్యాయం జరిగిందన్నారు. 4నెలల్లోనే వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రాజధానిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి నిర్మాణాలు, ఇతరేతర నివాసభవనాలు పూర్తయితే, అక్కడేమీ లేదని, గతప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడం వైసీపీనేతలకే చెల్లిందన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: