ప్రజా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ సుపరిపాలన అందిస్తు ముందుకు సాగుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ... పారదర్శక పాలన అందిస్తున్నారు  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అయితే ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు ఎన్నో హామీలు నెరవేర్చారూ సీఎం జగన్  జగన్. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల పరిగణిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే పార్టీ సినిమా ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది. 



 ఆర్టీసీ విలీన ప్రక్రియ లో ఏపీ సర్కార్ మరో ముందడుగు  వేసింది . ఆర్టీసీ విలీనం ప్రక్రియ పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసింది  జగన్ సర్కార్. ఆర్థిక, రవాణా,  జి.ఎ.డి న్యాయ శాఖకు సంబంధించిన ఏడుగురు  ఉన్నతాధికారులను గ్రూప్ సభ్యులుగా  నియమిస్తూ ... ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రూప్ సభ్యులు వచ్చే నెల 15వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు, డిజిగ్నేషన్లు,  పోస్టులు,  పే స్కేల్ విధి విధానాలపై ప్రభుత్వం నియమించిన వర్కింగ్  గ్రూప్ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 



 ప్రభుత్వం నియమించిన వర్కింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది  వైసీపీ సర్కార్.కాగా  చాలా రోజుల నుండి ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే  డిమాండ్ కార్మికుల నుంచి వినిపిస్తోంది. అంతేకాకుండా వైసిపి మేనిఫెస్టో లో ఈ హామీ పొందుపరచడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తొలి క్యాబినెట్ మీటింగ్ లోనే  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం పై నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ ఉపసంఘం, నిపుణుల   కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు సీఎం  వైయస్ జగన్మోహన్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: