హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఈవీఎం ట్యాపరింగ్ జరిగిందా ? అంటే అవుననే కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి అంటున్నారు . ఈవీఎం ల పనితీరు పై ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు అభ్యర్థులు ఇదే తరహా గతంలోనూ సందేహాలను  వ్యక్తం చేసిన విషయం తెల్సిందే . హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి పై అధికార టీఆరెస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు . హుజూర్ నగర్ ఫలితాలు వెలువడిన అనంతరం ఉత్తమ్ పద్మావతి , కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి ని కలిసి ఈవీఎం ల పనితీరు పై ఫిర్యాదు చేయడమే కాకుండా , బ్యాలెట్ విధానం ద్వారా రీపోలింగ్ చేపట్టాలని కోరారు .


 కేసీఆర్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని ,  ఎన్నికల ప్రచారం సందర్బంగా ప్రజలు తమవైపే మొగ్గు చూపారని ఉత్తమ్ పద్మావతి అన్నారు . అయితే ఎన్నికల ఫలితాలు దానికి పూర్తిగా భిన్నంగా వెలువడడం చూస్తుంటే ఈవీఎం ల పనితీరు పై అనుమానం కలుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు  . ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకట్టాలంటే హుజూర్ నగర్ లో బ్యాలెట్ విధానం ద్వారా రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు . గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ ఈవీఎం లను ట్యాపరింగ్ చేసి , టీఆరెస్  రెండవసారి అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించిన విషయం తెల్సిందే .


 ఈవీఎం లను ట్యంపర్ చేసే అవకాశాలున్నాయని పలువురు ప్రదర్శన చేసి చూపించడంతో ఈవీఎం ల పనితీరు పై అనుమానాలు లేకపోలేదు . అయితే ఈవీఎం లను ట్యంపర్ చేసే అవకాశాలు లేనేలేవని ఎన్నికల సంఘం ప్రతినిధులు పలుమార్లు వెల్లడించారు . ఈ నేపధ్యం లో ఉత్తమ్ పద్మావతి చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి .


మరింత సమాచారం తెలుసుకోండి: