నిజమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయిల సినిమా జీవితాన్ని కాదనుకుని.. రాజకీయాల్లోకి వచ్చాడు. కాదనలేం, కానీ ఎందుకో ఇప్పటికి కూడా పవన్ రాజకీయ నాయకుడిగా మారలేకపోతున్నాడు. రాజకీయ నాయకుల్లో ఎవరైనా తమకు పట్టు ఉన్న విషయాల పై అలాగే తమ పర్సనల్ విషయాల కన్నా తమ పని గురించి, ప్రతి పక్షాల వైఫల్యాల గురించే ఎక్కువుగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా సొంత డబ్బా కొట్టుకోరు. కానీ పవన్ కళ్యాణ్ కి ఆ అవగాహన లేదేమో అనిపిస్తోంది. సమావేశం ఏదైనా తన సొంత విషయాలను వెల్లడించాల్సిందే. తన సొంత డబ్బా కొట్టుకోవాల్సిందే. ఆ మాట కొస్తే తనకన్నా గొప్ప రాజకీయ నాయకుడే లేడు అని పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతుంటారు. పైగా జగన్ పై అనవసరమైన ఆరోపణలు చేస్తుంటారు. మధ్య మధ్యలో తను సినిమా రంగంలోకి అనుకోకుండా వచ్చానని, రాజకీయాలలోకి కూడా అలానే వచ్చానని, దేశ సేవ నిమిత్తం ఇక పై సినిమాలు చేయకుండా ప్రజల సేవ చేస్తానని పదేపదే చెబుతుంటాడు.
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని బలోపేతం చెయ్యడానికి తగిన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు పోవాలని చూస్తున్న అది అయ్యేలా కనిపించట్లేదు. జనసేన పార్టీ పై ప్రజల్లో నమ్మకం పెరగట్లేదు. నిజానికి పవన్ పార్టీ ప్రకటించిన రోజున జనసేన పరిస్థితికి... ఈ రోజు జనసేన పరిస్థితికి పెద్దగా వ్యత్యాసమే లేదు. పైగా ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. మొత్తానికి పవన్ వాస్తవ పరిస్థితులను పరిశీలించి.. రోజురోజుకి ప్రజల్లో తన పై నమ్మకాన్ని కల్పించలేకపోతున్నాడు.