జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎన్ని  ప్రయత్నాలు చేసినా..  బాబు పై ఎన్ని ఆరోపణలు చేసినా.. ఇప్పటికీ  పవన్ కళ్యాణ్ని  చంద్రబాబు నాయుడు మనిషిలానే చూస్తున్నారు. ఈ రోజు ఎమ్మెల్యే అంబటి రాంబాబు  'జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌  చంద్రబాబు దత్త పుత్రుడు' అన్న రేంజ్ లో చేసిన కామెంట్స్  నిజంగా  ఆశ్చర్యకరమే.  నిజానికి పవన్ ఈ మధ్య జగన్ తో పాటు బాబును కూడా బాగానే తిడుతున్నాడు. ఎన్ని తిట్టినా పవన్ పై టీడీపీ వాళ్ళు పెద్దగా కామెంట్లు చెయ్యట్లేదు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం పవన్ పై సీరియస్ అవుతున్నారు.   ముఖ్యంగా జగన్‌ పై కేసులు విచారణ జరుగుతుండగానే నేరస్తుడు అంటూ ఎలా అంటారని, వేల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకొనే పవన్‌ కల్యాణ్‌ కు తెలియదా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.   మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి మద్దతుగా పవన్‌ జనసేన పార్టీనీ స్థాపించారని  పవన్ కళ్యాణ్ ను తిడుతున్నారు.  రెండోచోట్ల పోటీ చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారో పవన్‌ తెలుసుకోవాలని హేళన చేస్తున్నారు.  ఇంతకీ పవన్ ఎందుకు జగన్ పై  పస లేని ఆరోపణలు చేస్తూ నవ్వుల పాలవ్వడం. పవన్ ఇక నుండైనా ఆలోచించుకోవాలి. 

నిజమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్  కోట్ల రూపాయిల సినిమా జీవితాన్ని కాదనుకుని..   రాజకీయాల్లోకి వచ్చాడు. కాదనలేం,  కానీ ఎందుకో ఇప్పటికి కూడా పవన్  రాజకీయ నాయకుడిగా మారలేకపోతున్నాడు.  రాజకీయ నాయకుల్లో ఎవరైనా  తమకు పట్టు ఉన్న విషయాల పై  అలాగే  తమ పర్సనల్ విషయాల కన్నా  తమ పని గురించి,  ప్రతి పక్షాల వైఫల్యాల గురించే ఎక్కువుగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా  సొంత డబ్బా కొట్టుకోరు. కానీ పవన్ కళ్యాణ్ కి ఆ అవగాహన లేదేమో అనిపిస్తోంది.  సమావేశం ఏదైనా  తన సొంత విషయాలను వెల్లడించాల్సిందే.   తన సొంత డబ్బా కొట్టుకోవాల్సిందే. ఆ మాట కొస్తే  తనకన్నా గొప్ప రాజకీయ నాయకుడే లేడు అని పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతుంటారు. పైగా జగన్ పై అనవసరమైన ఆరోపణలు చేస్తుంటారు. మధ్య మధ్యలో తను సినిమా రంగంలోకి అనుకోకుండా వచ్చానని, రాజకీయాలలోకి కూడా అలానే వచ్చానని, దేశ సేవ నిమిత్తం ఇక పై సినిమాలు చేయకుండా ప్రజల సేవ చేస్తానని పదేపదే చెబుతుంటాడు.  

ఏది ఏమైనా  పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని  బలోపేతం చెయ్యడానికి తగిన ప్రణాళికలు వేసుకుంటూ  ముందుకు పోవాలని చూస్తున్న అది అయ్యేలా కనిపించట్లేదు. జనసేన పార్టీ పై ప్రజల్లో నమ్మకం పెరగట్లేదు.  నిజానికి పవన్ పార్టీ ప్రకటించిన రోజున జనసేన పరిస్థితికి... ఈ రోజు జనసేన పరిస్థితికి పెద్దగా  వ్యత్యాసమే లేదు. పైగా ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. మొత్తానికి పవన్  వాస్తవ పరిస్థితులను పరిశీలించి..   రోజురోజుకి ప్రజల్లో  తన పై నమ్మకాన్ని కల్పించలేకపోతున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: