ఎట్టకేలకు టీఆర్ఎస్ అభ్యర్థి  సైదిరెడ్డి తన స్వప్నమైన ఎమ్మెల్యే పదవిని దక్కించుకున్నాడు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున విజయం సాధించిన సైదిరెడ్డి గురించి ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు.కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగరేసింది.మాజీమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గతంలో గట్టి పోటీ ఇచ్చిన సైదిరెడ్డి... ఇప్పుడు ఆయన సతీమణి పద్మావతిని ఓడించి... పోగొట్టుకున్న చోటే వెతుక్కున్నాడు. 2014 ఎన్నికల్లో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ (టీఆర్ఎస్)పై 23,924 ఓట్ల తేడాతో ఉత్తమ్ గెలుపొందారు.


 రాజకీయ నేపథ్యంతో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సైదిరెడ్డి... కాలేజీ రోజుల్లోనే రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. మాధవరెడ్డి, వేనెపల్లి చందర్ రావు సహకారంతో టీడీపీలో చేరారు. సైదిరెడ్డి కరేబియన్ ప్రాంతంలోని మొత్తం ఐటి విభాగానికి అధిపతిగా యునైటెడ్ నేషన్‌లో ఉద్యోగం కొరకు2000లో, జమైకాకు వెళ్లారు సైదిరెడ్డి. తరువాత 2005 లో కెనడాలోని వాంకోవర్కు వెళ్లి ప్రపంచ ప్రముఖ ఐటి కంపెనీలో ఉద్యోగం పొందారు. తన సహజమైన ఉత్సాహం వాంకోవర్ లో ఉత్తమ శాఖాహార రెస్టారెంట్లలో ఒకదాన్ని స్థాపించటానికి ప్రేరేపించింది.

ఆ తరువాత కేసీఆర్ స్పూర్తితో తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులైన సైదిరెడ్డి... జగదీష్ రెడ్డి నాయకత్వంలో టీఆర్ఎస్‌లో పని చేశారు. 2017 సంవత్సరంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు హుజూర్ నగర్ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సైదిరెడ్డి... 2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఉత్తమ్‌ గట్స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

అయినప్పటికీ నియోజకవర్గంలో ప్రజలకు, టీఆర్ఎస్ శ్రేణులకు అందుబాటులో ఉంటూ వచ్చిన సైదిరెడ్డి... స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి కృషి చేశారు. అలా నియోజకవర్గంలో తన నెట్‌వర్క్‌ను బాగా పెంచుకున్నారు. ఎంపీగా గెలిచిన ఉత్తమ్ హుజూర్ నగర్ స్థానానికి రాజీనామా చేయడంతో... అప్పటి నుంచే ఈ సీటుపై ఫోకస్ పెంచారు సైదిరెడ్డి. టీఆర్ఎస్ నేతల సహకారం కూడా లభించడంతో... ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: