తమిళనాట రెండు స్థానాలలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి పడింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి సత్తా చాటిన ప్రతిపక్ష డీఎంకే.. ప్రస్తుతం జరిగిన రెండు బై ఎలక్షన్‌లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. తమిళనాడులోని నంగునేరి, విక్రవండి అసెంబ్లీ నియోజకవర్గాలలోను అన్నా డీఎంకే జెండా ఎగుర వేసింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోగా.. డీఎంకే పుజుకుందని అందరు అనుకున్నారు. కాని ఈ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. 


ఈ ఫలితాలతో డీఎంకే పార్టీ నేతలకు గొంతులో పచ్చి వెలగకాయ పడినట్లైంది. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయ సమీకరణాలు.. శరవేగంగా మారినట్టు కనిపించింనా ఆ ప్రభావం ఇప్పుడు అస్సలు చూపలేకపోయింది. రెండు స్థానాలలోను డీఎంకే పార్టీని తమిళ ప్రజలు వద్దనుకున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా వెలువడటంలో స్టాలిన్ షాక్‌లో ఉన్నారట.
 
ఈ రెండు స్థానాలు ప్రతిపక్ష డీఎంకే ఖాతాలో పడతాయని అందరు అంచనా వేసినా ఫలితాలు అందుకు బిన్నంగా రావటం డీఎంకే పార్టీ నేతలలో కలవరం మెదలైంది. అటు అన్నాడీఎంకే నేతలు మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారు. తమిళ ప్రజలు తమ వెంటే ఉంటారని, అమ్మ ప్రవేశ పెట్టిన పథకాలే తమకు అండగా ఉంటాయన్నారు. జయ పార్టీకే తమిళులు జైజైలు పలికారు.


 కాగా జయ మరణం తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడిన తమిళనాట డీఎంకే ఇంకా తన ప్రభావాన్ని పెంచుకోవాల్సిన నేపథ్యంలో వరుస ఓటములు ఆ పార్టీ వర్గాలు ఆందోళన కలిగిస్తున్నాయి. స్టాలిన్ రాజకీయ వ్యూహాలు ఈ విధంగా విఫలమవడం వెనుక కారణంపై ఆ పార్టీ వ్యూహా కమిటీ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలపరిచే విధంగా పనిచేయాలని సూచనలు అధిష్టానం పెద్దలు ఇస్తున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: