తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు 21 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు యూనియన్లను పక్కన పెట్టి పని చేస్తే రెండేళ్లలో లక్ష రూపాయల బోనస్ తీసుకునే పరిస్థితి ఉందని కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అక్రమమని కేసీఆర్ అన్నారు. యూనియన్లు పాత ఆర్టీసీని బతికిబట్టగట్టే పరిస్థితి లేకుండా చేశాయని సీఎం అన్నారు. 
 
ఆర్టీసీకి యూనియన్ల చిల్లర రాజకీయాలతో భవిష్యత్ ఉండదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. 2600 బస్సులను రీప్లేస్‌మెంట్‌ చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. ఎస్మా ఉండగా సమ్మెకు పోవటం కరెక్ట్ కాదని కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆర్టీసీ ముగింపే జవాబు అని కేసీఆర్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం 100 శాతం అసంభవం అని కేసీఆర్ అన్నారు. 
 
సమ్మెకు వెళ్లేముందు కార్మికులు తమ కుటుంబాల గురించి, తమ గురించి ఆలోచించాల్సిందని కేసీఆర్ అన్నారు. కార్మికుల్లో పిచ్చి ఆలోచనలు ప్రవేశపెట్టి యూనియన్లు కార్మికుల బతుకులు నాశనం చేస్తున్నాయని కేసీఆర్ అన్నారు. 5 వేల కోట్ల రూపాయల అప్పు ఆర్టీసీకి ఉందని, ప్రభుత్వం పీఎఫ్ సొమ్ము తీసుకుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. 
 
ఆర్టీసీకి సంవత్సరానికి 1200 కోట్ల రూపాయల నష్టాలు వస్తున్నాయని కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు సగటున 50 వేల రూపాయల జీతం వస్తుందని కేసీఆర్ అన్నారు. పనికిమాలిన డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోయారని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వమంటే దానికో బాధ్యత, పద్ధతి ఉంటుందని కేసీఆర్ అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయటం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. ఆర్టీసీ యూనియన్లు చేస్తోంది మహా నేరం, మహా పాపం అని సీఎం కేసీఆర్ అన్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: