తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కాని పరిస్దితి. ఎలక్షన్స్ ముందు వరకు కార్మికులకు న్యాయం జరుగుతుందని అంతా ఆశించారు. వారి కోరికలు కేసీయార్ నెరవేర్చుతారని భావించారు. కానీ హుజూర్‌నగర్ ఫలితాలు ఒక్కసారిగా ఊహించని మార్పులను తెచ్చాయి. ఇన్నాళ్లూ ఆర్టీసీ విషయంలో ఎక్కువగా స్పందించని తెలంగాణ సీయం కేసీయార్ ఒక్కసారిగా ఆర్టీసీ కార్మికులపై, కార్మిక సంఘాలపై జూలు విదిల్చిన సింహంలా దూకాడు. ఆయన మాట్లాడిన మాటల్లో ఇక తనకు ఎదురులేదనే నమ్మకం సృష్టంగా తేటతెల్లమవుతుంది.


ఈ పరిస్దితుల్లో సమ్మె దారి ఎటువైపు, సమ్మె చేస్తున్న కార్మికుల భవిష్యత్తుకు మార్గం ఏంటనే  విషయం ఎవరికి అర్ధం అవ్వడంలేదు. ఇకపోతే అన్ని తానై యుద్దాన్ని నడిపిస్తున్న  అశ్వత్థామ రెడ్డి పరిస్దితి ఇప్పుడు ఏంటి ? కేసీయార్ తన నిర్ణయాన్ని దాచుకోకుండా చెప్పారు. ఈ సమయంలో సమ్మె విషయంలో  అశ్వత్థామ రెడ్డి తీసుకునే నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారింది. ఇకపోతే ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం మాత్రం జోరుగానే సాగుతుంది. నాగర్‌కర్నూల్‌లో గురువారం (అక్టోబర్ 24) ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ. ఆర్టీసీ కార్మికులను అవమానించేలా సీఎం కేసీఆర్‌ మాట్లాడారని. ఆర్టీసీ ఉద్యోగులను తీసేసే ఆధికారం ఎవరికీ లేదని, ఆర్టీసీ ఎవరి జాగీరూ కాదని, కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ ఆశ్వత్థామ రెడ్డి అన్నారు.


ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్‌ మాటలకు కార్మికులు ఎవరూ భయపడొద్దని పిలుపు ఇచ్చారు. ఇకపోతే ఇష్టం ఉన్నట్లు చేస్తామంటే న్యాయస్థానాలు ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు. కార్మికుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలని హితవు పలికారు. ఇక తాముకోరుతున్న కోరికలు గొంతెమ్మ కోరికలు కావని స్పష్టం చేశారు. ఇకపోతే ఇప్పటివరకు ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోగలిగామంటే యూనియన్లు ఉండబట్టే అది జరిగిందని, లేకుంటే ఆర్టీసీ ఆస్దులన్ని ఎప్పుడో కబ్జా జరిగి ఉండేవని వ్యాఖ్యానించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: