బీజేపీ ఏపీలో ఎదగాలనుకుంటోంది.  ఉత్తరాది అంతా జయించేశాం, ఇంకేముంది, దక్షిణాదిని ఒడిసిపట్టేస్తామనుకుంటోంది. బీజేపీకి నిజానికి ఓ పెద్ద సరిహద్దు ఉంది. అది ఎపుడూ చూసినా బీజేపీని భయపెడుతోంది. అలా ఇలా కాదు. ఓ పెద్ద చాలెంజ్ కూడా చేస్తోంది. ఆ బిగ్ టాస్క్ ని బీజేపీ, అంతకు ముందు జనసంఘ్ కాలంలో కూడా ఎవరూ చేదించలేకపోయరు. మరి మోడీ రెండవ దఫాకు వచ్చేశారు.


మోడీకి ప్రజలు ఇచ్చిన ఆఫర్లు కూడా అయిపోయాయి. మోడీ హవా క్రమంగా తగ్గుతోంది. ఇక మోడీ మ్యాజిక్ పెద్దగా పనిచేయదని తాజా ఎన్నికలతో  క్లారిటీగా తెలిసిపోతోంది. ఈ టైంలో మోడీ అమిత్ షా ఏపీపై ఆశలు పెట్టుకున్నారు. అంతేనా తెలంగాణాపైనా పెద్దాశతో ఉన్నారు. అక్కడే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో డిపాజిట్  గల్లంతు  అయింది. ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు మొన్నటి ఎన్నికల్లో పోల్ అయ్యాయి.


ఈ నేపధ్యంలో బీజేపీకి ఏపీలో బలం కావాలంటే బాబు గారే శరణ్యమన్న మాట వినిపిస్తొంది. ఎంత కాద‌న్నా ఏపీలో టీడీపీ బలంగా ఉంది. ఆ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో కూడా పటిష్టమైన బలం ఉంది. ఇక ఇప్పటి వరకూ మబ్బుల్లో విహరించిన బీజేపీ మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు చూసుకుని నేలకు దిగి వస్తుందని బాబుతో పాటు టీడీపీ తమ్ముళ్ళు భావిస్తున్నారు.


అదే జరిగితే మరో మారు బీజేపీతో జత కట్టి పదో పన్నెండో అసెంబ్లీ సీట్లు పారేసి తన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు బాబు తయారుగా ఉంటారు. ఇక మహారాష్ట్ర, హర్యానా  ఫలితాలు,  హుజూర్ నగర్ రిజల్ట్ చూసిన తరువాత ఏపీలో ఎవరూ పెద్దగా బీజేపీలోకి వెళ్ళకపోవచ్చు, ఆ విధంగా టీడీపీకి పెద్ద రిలీజ్. మొత్తానికి బీజేపీ కన్ను లొట్టబోవడం చంద్రబాబు అండ్ కోకు హ్యాపీగా ఉందంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: