వాహనదారులు కాస్త ఊపిరి పీల్చుకునే న్యూస్. ఇంధన ధరలు క్రమక్రమంగా తగ్గు ముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురులు తగ్గడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. దీనితో టూ వీలర్ రైడర్లకు కాస్త ఊరట లభించనట్లేనని చెప్పొచ్చు. ఇకపోతే ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను ఒకసారి పరిశీలిస్తే. ఈ రోజు అంటే శుక్రవారం పెట్రోల్ ధర 12 పైసలు, డీజిల్ ధర 6 పైసలు చొప్పున దిగిరావడంతో, హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.77.69కు తగ్గింది. డీజిల్ ధర కూడా రూ.71.97కు క్షీణించింది.


ఇకపోతే అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే కొనసాగుతుంది.. పెట్రోల్‌ ధర 11 పైసలు తగ్గుదలతో రూ.77.31కు క్షీణించింది. డీజిల్‌ ధర కూడా 6 పైసలు క్షీణతతో రూ.71.27కు చేరింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 11 పైసలు, 5 పైసలు చొప్పున దిగొచ్చాయి. దీంతో పెట్రోల్ ధర రూ.76.94కు క్షీణించింది. డీజిల్ ధర రూ.70.93కు తగ్గింది. ఇవి మన తెలుగురాష్ట్రాల్లో ఉన్న ధరలు ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 11 పైసలు తగ్గుదలతో రూ.73.06కు క్షీణించింది. డీజిల్ ధర కూడా 6 పైసలు క్షీణతతో రూ.66.00కు తగ్గింది.


వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 10 పైసలు క్షీణతతో రూ.78.68కు తగ్గింది. డీజిల్ ధర కూడా 7 పైసలు తగ్గుదలతో రూ.69.17కు క్షీణించింది..ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.42 శాతం తగ్గుదలతో 61.41 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.43 శాతం క్షీణతతో 55.99కు తగ్గింది...ఇకపోతే ప్రస్తుతం చమురు ధర ఎంత ఉందో దానిపైన విధించే పన్నులు కూడా దాదాపు అంతే ఉన్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: