జగన్ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత... కాకముందు కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెసిఆర్ ఇచ్చిన భరోసా అందించిన తోడ్పాటు తో కచ్చితంగా వైసిపి వర్గాలనుంచి అతనిపై సానుకూల దృక్పథం బాగానే ఉంది. ఆ తర్వాత నీటిపారుదల తదితర విషయాలకు సంబంధించి కూడా ఇద్దరు కలిసి రెండు రాష్ట్రాల ఉపకారానికి ఎన్నో నిర్ణయాలు మూకుమ్మడిగా తీసుకున్నారు. దీంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య ఇన్ని రోజులు రాజకీయం కోసం చూపిన తేడాలు మరుగున పడిపోయాయి అనుకున్నారు అంతా. కానీ వారికి తెలియకుండానే ఇద్దరి మధ్య ఒక్కసారిగా వైరం వచ్చేసింది. ఎందుకంటే వాళ్ల బ్రతుకుతున్నది 'దోస్త్ మేరా దోస్త్' సినిమాలో కాదు... ఒక రాజకీయ చదరంగంలో.

విషయానికి వస్తే జగన్ ఆర్టీసీ ను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తా అని ప్రకటించిన తర్వాత తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులు తీవ్ర స్థాయిలో వారి రాష్ట్రానికి వ్యతిరేకంగా సమ్మె చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 20 రోజులు ఇది ఎంత పెద్ద రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరికి ఎంతో కఠినంగా ఉండే కేసీఆర్ సైతం వారి కొన్ని డిమాండ్లకి దిగక తప్పలేదు. అయితే అతని అసహనం అంతా నిన్న ప్రెస్ మీట్ లో బయటపెట్టాడు టిఆర్ఎస్ అధినేత.

ఎవరూ ఊహించని విధంగా దీనంతటికీ జగన్ ని బలిపశువును చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో జగన్ తీసుకొన్న నిర్ణయం భూగోళము ఉన్నంతవరకూ సాధ్యపడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కేవలం కమిటీ వేశారని మూడు నెలలు ఆరు నెలల్లో ఆర్టీసీ విలీనం ఆంధ్రప్రదేశ్లో కూడా మరుగున పడిపోయే అంశం అని ఆయన నిక్కచ్చిగా మాట్లాడారు.

కెసిఆర్ ఒకవైపు అలా విరుచుకుపడుతుంటే జగన్ కూడా తన రాజకీయ చతురతకు పదును పెట్టారు. చంద్రబాబుతో ఇదే ఆట ఎన్నో ఏళ్లగా ఆడి రాటుదేలి పోయిన జగన్ వెంటనే విలీనం పనులు వేగవంతం చేశారు. ఒక వర్కింగ్ గ్రూప్ ను నియమించి పోస్టులు, ప్రజా రవాణా శాఖ ఏర్పాటు మరియు డెజిగ్నేషన్ల పనులపై దృష్టి సారించమని ఆదేశించారు. దాదాపు అన్ని విషయాలను ఇక్కడ కవర్ చేస్తూ నవంబర్ 15 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక కేసీఆర్ వాక్కు ఫలిస్తుందో లేదో జగన్ పట్టుదల నిలుస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: