ఎన్నికలు కొందరి నాయకుల జీవితాలను నిర్దేశిస్తాయనడానికి ఉదాహరణగా హుజూర్‌నగర్లో జరిగిన ఉప ఎన్నికలే సాక్ష్యంగా చెప్పవచ్చు. గులాభిజెండా పాతి కేసీయార్ కుషిలో ఉంటే. కాంగ్రెస్ ఘోర ప‌రాభ‌వంతో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పీసీసీ మార్పు అంశంపై ఇప్ప‌టికే పార్టీలో జోరుగా చ‌ర్చ సాగుతున్న నేపధ్యంలో ఉత్తమ్‌ తగుజాగ్రత్తగా మెదిలి ఈ ఎన్నికల్లో ఇక్కడి స్దానాన్ని పదిలంగా కాపాడుకుంటారని అనుకున్నారు అందరు. కాని హూజూర్‌న‌గ‌ర్ ఓట‌మితో పీసీసీ మార్పు త‌ప్ప‌నిస‌రిగా మారిందని అంటూ కాంగ్రెస్లోని మ‌రో వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది.


ఇకపోతే హూజ‌ర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేత‌లంతా క‌లిసి ఉన్న‌ట్లు బ‌య‌ట ప్ర‌చారం చేసినా.. లోప‌ల మాత్రం ఓడిపోవాల‌న్న భావ‌న‌తోనే ఉన్నార‌ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంపీగా ఉత్త‌మ్ గెలిచినా.. ఎమ్మెల్యే స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో మాత్రం ఓడిపోయారు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్‌ పూర్తిగా విఫలమైయ్యారు. దీన్ని కాంగ్రెస్ హైక‌మాండ్ సీరియ‌స్‌గా తీసుకునే అవ‌కాశ‌ముంది. కాబట్టి పీసీసీ పదవిని కూడా వేరే నాయకునికి కట్టబెట్టే ఆలోచన చేస్తుందంటున్నారు. ఇకపోతే పీసీసీ చీప్ ప‌గ్గాల‌పై ఆశ‌లుపెట్టుకున్న నేత‌లే.. ఉత్త‌మ్ కొంప‌ముంచార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుంది.


ఇప్పటికే పీసీసీ స్దానానికి సీనియ‌ర్ నేత ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌బాబు పీసీసీ ప‌గ్గాల కోసం నేను సైతం అంటున్నారు. అంతే కాకుండా ద‌ళిత కోటాలో ఏఐసీసీ కార్య‌ద‌ర్శి సంప‌త్‌, బీసీ కోటాలో పొన్నం ప్ర‌భాక‌ర్‌లు పీసీసీ ప‌గ్గాల కోసం పోటీప‌డుతుండగా, కొత్త‌గా చేరిన రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు పీసీసీ ప‌గ్గాలు అందిస్తారోన‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. వీరి పరిస్దితి ఇలా ఉండగా న‌ల్గొండ‌లో బ‌ల‌మైన నేతగా ఉన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అధిష్టానం మెప్పు కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు..ఇన్ని రాజకీయ ఎత్తుగడల మధ్య, తెలంగాణ‌లో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో పీసీసీ మార్పుపై కాంగ్రెస్ హైక‌మాండ్ మ‌రికొన్ని రోజుల్లోనే కీల‌క‌నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం స్స‌ష్టంగా క‌నిపిస్తోందని తెలుస్తుంది. ఈ దశలో ఎవరిని పీసీసీ పదవి వరిస్తుందో అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: