ఏపీలోని రాజకీయ నాయకులకు బీపీ తెప్పించే హాట్ టాపిక్ ‘ఇసుక’. గత ఎన్నికల ఫలితాల్లో ఇసుక ప్రధాన పాత్ర పోషించింది. కారణం.. ఇసుక రీచ్ ల్లో అక్రమ తవ్వకాలు, కొందరి స్వార్ధ ప్రయోజనాలు. చిత్తూరు జిల్లా నుంచి పొరుగు రాష్ట్రం తమిళనాడుకు అక్రమంగా ఇసుక రవాణా అయిపోయేది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అప్పటి ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోయింది.

 


ప్రస్తుత ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. తెలంగాణలో అమలవుతున్న ఇసుక విధానాన్ని పరిశీలించిన అనంతరం ఏపీలో కూడా ఇసుక పాలసీ తీసుకురావాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 5 నుంచి ఇసుక కొత్త పాలసీ అమల్లోకి వచ్చింది. ప్రణాళికాబద్దంగా ఇసుక అందించాలనేది ప్రభుత్వం ఆలోచన. కానీ ఇసుక ధర ఎక్కువైపోయిందని కొన్ని వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. భవన నిర్మాణ కార్మికులు కూడా రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం 100కు పైగా ఇసుక రీచ్ లను గుర్తించామని పారదర్శకంగా ఇసుక అందిస్తున్నామని చెప్తోంది. ఇటివలి వర్షాలతో ఇసుక తవ్వకాలకు అంతరాయం ఏర్పడింది. రోజుకు లక్ష టన్నుల ఇసుక సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 41 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యత ఉందని చెప్తున్నారు. . ఏపీఎండీసీ ద్వారా ఇసుకను భారీగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కృష్ణాకు మళ్లీ వరద పోటెత్తుతోంది. దీంతో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఇసుక లభ్యత పెరిగినా ప్రస్తుతానికి అందనట్టే. కేవలం ఇసుక లభ్యత మీదే ఆధారపడిన కుటుంబాలు రోడ్డెక్కుతున్నాయి. దీంతో ఇసుక బంగారంలా మారింది.

 


దినసరి కూలీ కుటుంబాలెన్నో భవన నిర్మాణాల మీద ఆధారపడి ఉన్నాయి. గతం కంటే ఇసుక ధర ఎక్కువైందని నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో వీరికి పని దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క ఇసుక అక్రమ తవ్వకాలు ఇంకా జరుగుతున్నాయి. విజయవాడలోని వారధి కింద కొందరు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్టు పత్రికల్లో వచ్చింది. దీనిని నియంత్రించాల్సిన అవసరముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: