ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలపై దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు నిఘా వర్గాలు గుర్తించాయి. కేంద్ర హోం శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆయా విభాగాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు 370 ఆర్టికల్ కు సంబంధించి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న నేతలు, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన నేతలపై దాడికి పాల్పడాలని ఉగ్రమూకలు ప్రణాళికలు వేసినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. 
 
నిఘా వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం మరియు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన అగ్ర నేతలు, హిందూ ధార్మిక సంస్థల నేతలను టార్గెట్ చేయటంతో పాటు ఎన్.ఐ.ఎ ప్రధాన కార్యాలయం, సీజీవో కాంప్లెక్స్, పోలీసు, పారామిలిటరీ శిక్షణా కేంద్రాలను ఉగ్రదాడులతో ముంచెత్తాలని ఉగ్రవాదులు ప్రణాళికలు రచించాయని, ఆత్మాహుతి దాడులకు కూడా పాల్పడాలని ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. 
 
ఇప్పటికే పీవోకే ద్వారా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర హోం శాఖ ఢిల్లీ పోలీసులకు ప్రధానంగా హెచ్చరికలు జారీ చేసిందని తెలుస్తోంది. పోలీసు, పారామిలిటరీ శిక్షణా కేంద్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ సూచించింది. మహారాష్ట్ర పోలీసులను కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ సూచించింది. 
 
ప్రధాన నేతలకు తగిన భద్రత కల్పించాలని హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ ఢిల్లీ స్పెషల్ సెల్ ను కూడా అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు నేతలపై ఉగ్రవాదులు గురిపెట్టినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. 370 రద్దు పరిణామాలతో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు సిద్ధపడుతున్నారని నిఘావర్గాలు చెబుతున్నాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ నగర పోలీసులు అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: