కేంద్రమాజీ మంత్రి,  టిడిపి  ఫిరాయింపు ఎంపి సుజనా చౌదరి ఇంతకీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు ? ఆయన చేస్తున్న ప్రకటనలు, చేస్తున్న పనుల్లో క్లారిటి లేకపోవటంతో ఇటు టిడిపి అటు బిజెపి నేతల్లో అయోమయం నెలకొంది. తనకు రాజకీయ బిక్ష పెట్టిన  చంద్రబాబునాయుడు ప్రయోజనాలను రక్షించటానికే సుజనా టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే.

 

బిజెపిలోకి ఫిరాయించిన దగ్గర నుండి ఒకసారి చంద్రబాబుకు అనుకూలంగాను మరోసారి బిజెపి ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. దాంతో ఆయన వైఖరి ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. తాజాగా టిడిపి ఎంఎల్ఏ వల్లభనేని వంశీతో సుజనా భేటి అవటం టిడిపిలో కలకలం రేగుతోంది.

 

టిడిపిని నేలమట్టం చేయటానికే బిజెపి అగ్రనాయకత్వం కంకణం కట్టుకున్నదన్న విషయంలో సందేహం లేదు. అందుకనే టిడిపి నుండి ఎవరువచ్చినా తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. వీలైనంతమంది నేతలను తమ పార్టీలో చేర్చుకోవటం ద్వారా టిడిపిని పూర్తిగా దెబ్బ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నది ఢిల్లీ నాయకత్వం.

 

అందుకోసమనే టిడిపి నేతలతో సుజనా భేటి అవుతున్నారు. ఇప్పటికే కొందరు టిడిపి నేతలు సుజనాతో భేటి తర్వాతే బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా సుజనాతో వంశీ భేటిపై అందుకనే టిడిపి నేతల్లో టెన్షన్ మొదలైంది.

 

అదే సమయంలో  బిజెపితో పొత్తుకు చంద్రబాబు తనను సంప్రదిస్తే సయోధ్య కుదర్చటానికి తాను సిద్ధమన్నట్లుగా సుజనా రెండు రోజుల క్రితమే ప్రకటన చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా తాను చూసుకుంటానన్న అర్ధమే వస్తోంది. లేకపోతే ఒకవైపు బిజెపి నాయకత్వం చంద్రబాబుపై మండిపోతుంటే చంద్రబాబుకు మద్దతుగా సుజనా బహిరంగ ప్రకటన ఎలా చేయగలుగుతారు ? ఇక్కడే సుజనా వైఖరేంటో రెండు పార్టీల నేతలకు అంతుపట్టటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: