ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఏపిని అభివృద్ధిపధంలో నడిపించడానికి ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్నారు. గతపాలకుల వైఫల్యాలతో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని సరిదిద్ది ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మోస్తూనే, ఎక్కడెక్కడ అవినీతి జరిగిందనే విషయంలోని లోటుపాట్లను జాగ్రత్తగా పరిశీలిస్తూ, ముందుకు సాగుతున్నాడు. ఈ నేపధ్యంలో కొన్ని కొన్ని పధకాలు అమలు జరపడంలో సమయం కాస్త అటుఇటూ జరిగింది. దీనికే ప్రతి పక్షాలు నానాయాగి చేస్తు లేనిపోని అపోహలతో, అనవసరమైన మాటలతో వైసీపీ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నాయి.


ఇకపోతే  ఖాళీగా ఉన్న ఖజానాను భర్తిచేస్తూ, అదేసమయంలో చెప్పిన వాగ్దానాలను, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, రాష్ట్రంలో ఉన్న ఆర్ధిక పరిస్దితులు ఎక్కడా తారుమారవ్వకుండా పాలన చేయడమంటే నిజంగా చెప్పినంతా సులువు కాదు. అందుకే జగన్ ముందు ఎన్ని సమస్యలు నిలబడి బయపెట్టాలని చూస్తున్నా, ప్రతిపక్షాలు ఎంతగా అభివృద్ధిని అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను యుక్తిగా చేధిస్తూ జగన్ తనదైన మార్క్‌తో ముందుకు వెళ్లుతున్నారు. ఇకపోతే ఏ దేశమైన, రాష్ట్రమైన పాలకులు సరిగ్గా లేనిసమయంలో ముందుకు దూసుకెళ్లడం అసాధ్యం. సరైన నాయకుడు స్వార్దంతో లేకుండా పాలన చేస్తేనే ఆ రాష్ట్రం అభివృద్దిని సాధిస్తుందనేది నిజం.


గుర్రం గుడ్డిదైన దాన్ని నడిపేవారు సరిగా ఉంటే చాలు. కాని గుర్రాన్ని తోలేవారే గుడ్డివారైతే దాని పరుగులు అడ్డదిడ్డంగా సాగుతాయి. గతపాలకుల చేష్టలు ఇలాగే ఉన్నాయి. అందుకే ఏపిలో ఖజానా ఖాళిగా మారింది. దీన్ని సరిదిద్దాలంటే ఒక్కరోజులోనో, ఒకసంవత్సరంలోనో అయ్యే పనికాదు. ఇక్కడున్న వనరులను ఒడిసిపట్టుకొని సరైన దిశలో వినియోగించుకుంటూ, ఆదాయా మార్గాలను సృష్టించుకుంటే అభివృద్ది అనేది సాధ్యం అవుతుంది.ఇప్పుడు ఏపి సీయం చేస్తున్న పని ఇదే దీన్ని గ్రహించలేని ప్రతిపక్షాలు అనవసరంగా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: