ఇసుక కొరతపై టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తోంది. తమ హయాంలో ఇసుకను ఉచితంగా అందించామని ప్రస్తుతం బంగారమైనా దొరుకుతుంది కానీ ఇసుక దొరకట్లేదని అంటోంది. నిజానికి ఇసుక ఉచితం చేసినా అప్పట్లో ఎన్ని అక్రమ మార్గాల్లో ఇసుక దారి మళ్లిందో తెలియని విషయం కాదు. దీంతో తక్కువకు ఇసుక దొరకడం అటుంచితే ఇసుక అక్రమ తవ్వకాలు పెరిగిపోయాయి. ఇసుక అక్రమాలను అరికట్టడంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం వైఫల్యం కూడా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. 

 

 

 

ఇసుక అక్రమ తవ్వకాలతో పాటు అక్రమ తరలింపులు గతంలో భారీగా జరిగాయి. చిత్తూరు జిల్లా నుంచి పొరుగున తమిళనాడుకు ఇసుక అక్రమ సరఫరాలో స్థానిక స్వర్ణముఖి నది ఎంతగానో నష్టపోయింది. జిల్లాలోని ఏర్పేడు మండలంలోని స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలు ఏస్థాయిలో జరిగిందో తెలిసిందే. తవ్వకాలను ఆపాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద కొందరు సమీప గ్రామస్థులు ఆందోళన చేస్తున్న సందర్భంలో వారిపైకి లారీ దూసుకెళ్లి 22 మంది మరణించారు. ఇక్కడి ఇసుక తవ్వకాలకు కారకుడైనా మండల టీడీపీ అధ్యక్షుడిని పార్టీ సస్పెండ్ కూడా చేసింది. అప్పటి సీఎం చంద్రబాబు ఇంటి సమీపంలో కృష్ణా నదిలో ఇసుక అక్రమ రవాణా జరిగింది. కృష్ణానదిలోనే 2017లో ఇబ్రహీంపట్నం వద్ద జరిగిన టూరిజం బోటు దుర్ఘటనకు కారణం కూడా అక్కడి ఇసుక అక్రమ తవ్వకేమనని అనేక విమర్శలు వచ్చాయి. 

 

 

 

మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఇసుక ఓ ప్రధాన కారణంగా నిలిచింది. ప్రస్తుత పరిస్థితులను పలు పార్టీలు ఓ అవకాశంగా తీసుకుంటున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కొత్త ఇసుక విధానం తీసుకొచ్చింది. ఇసుక లభ్యతకు వరదలు కూడా ఓ కారణం. ప్రభుత్వమే ఇసుక రీచ్ లను గుర్తించింది. ప్రస్తుతం టీడీపీ చేస్తున్న ఆందోళనలో అర్ధం లేదని ప్రభుత్వం వాదిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: