గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నది.  ఇసుక కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు.  బంగారం కంటే ధరలు దారుణంగా ఉంటున్నాయి.  ఈ స్థాయిలో ఇసుక కొరత ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తలెత్తలేదు.  దీనిపై ప్రతిపక్ష పార్టీలు నానా రచ్చ చేస్తున్నాయి.  కొన్ని విషయాల్లో ఆచి తూచి మాట్లాడే పవన్ సైతం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.  ఇసుక కొరత, రాజధాని విషయాలపై ఈరోజు పవన్ కళ్యాణ్ మండిపడ్డాడు.  


ఈరోజు పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ఇసుక లారీ డ్రైవర్లు కలిశారు.  రాష్ట్రంలో వారు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారు.  దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని పవన్ ను కోరారు.  ఇసుక కొరత దారుణంగా ఉందని, ఇసుక రవాణా ఉంటేనే తమకు ఉపాధి ఉంటుందని అంటున్నారు.  దీనిపై పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ప్రభుత్వ పనితీరుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, ఇసుక రవాణా జరిగే వరకు పోరాటం చేస్తామని వారికీ హామీ ఇచ్చారు.  


ఇసుక కొరత ప్రభావం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలపై పడిందని, భవన నిర్మాణ కూలిలు ఉపాధి లేక రోడ్డుల పడుతున్నారని, వారి కుటుంబాలు తిండి దొరక్క అల్లాడుతున్నారని పవన్ చెప్పారు.  ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు.  ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బదులు పడుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలని చెప్పారు.  ఇసుక కావాలంటే అర్ధరాత్రి సమయంలో మాత్రమే ఎందుకు బుకింగ్ చేసుకోవాలని పవన్ నిలదీశారు.  


ఇక ఇదిలా ఉంటె, పవన్ రాజధాని విషయంలో కూడా జగన్ పై మండిపడ్డారు.  రాజధాని ఎక్కడా ఏంటి అనే విషయాలు ఇప్పటికి బయటకు రావడం లేదని, అమరావతిలో రాజధాని నిర్మాణం ఉంటుందా ఉండదా అని నిలదీశారు.  రాష్ట్రానికి న్యాయం చెప్పే హైకోర్టులో ఒక కప్పు టీ కూడా దొరకడం లేదని, ఇది చాలా దారుణం అని అన్నారు.  రాజధాని అమరావతిలోని ఉంటుందా లేదంటే.. రాయలసీమకు తరలివెళ్తుందా అన్నది తెలియాల్సి ఉందని అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: