ఏపీ వైసీపీ మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫిబ్రవరి 11వ తేదీ 2019 సంవత్సరంలో ఢిల్లీలో ఒక దీక్ష చేశారని ఆ దీక్ష కోసం పది కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ జీవో ఇచ్చిందని అన్నారు. కోటీ పాతిక లక్షల రూపాయలు రైళ్ల ఖర్చు కోసం ఖర్చు పెట్టారని మిగతా డబ్బును ఇతర ఖర్చుల కొరకు ఖర్చు పెట్టారని టీడీపీ ప్రభుత్వం చెబుతోందని పేర్నినాని అన్నారు. 
 
ప్రజల డబ్బును ఈ రకంగా క్షవరం చేశారని  టీటీడీ నుండి కూడా 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని పుంఖానుపుంఖాలుగా పత్రికల్లో, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయని పేర్నినాని అన్నారు. ధర్మ పోరాట దీక్షల పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రజల డబ్బును దుర్వినియోగం చేసిందని అన్నారు. సొమ్ము ప్రజలది.. సోకు టీడీపీది అన్న చందాన  చంద్రబాబు బరితెగించి పరిపాలన చేశారని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్నినాని అన్నారు. 
 
చంద్రబాబు ప్రజల సొమ్ముతో దొంగ దీక్షలు, దొంగ ధర్నాలు చేశారని పేర్నినాని అన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో తప్పులు చేయనిది ఎప్పుడని పేర్నినాని ప్రశ్నించారు. చంద్రబాబు మొదట్లో నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకొని తరువాత మోడీని తిట్టడమే కాకుండా తన బావమరిదితో తిట్టించారని అన్నారు. చంద్రబాబు బంగారు బాతులాంటి రాజధాని నిర్మాణం చేశారని చెబుతారని  హైకోర్టు జడ్జి మాత్రం ఏ సౌకర్యాలు ఉండవని అన్నారని పత్రికల్లో రాశారని పేర్నినాని అన్నారు. 
 
హైకోర్టు జడ్జి గారికి రాజధాని ఎందుకు కనిపించటం లేదని చంద్రబాబును పేర్నినాని ప్రశ్నించారు. చట్టాలకు వ్యతిరేకంగా దళితులకు పంచిపెట్టిన భూములను ధనవంతులు దోచుకునేలా జీవోలు జారీ చేశారని పేర్నినాని అన్నారు. ఇప్పుడు మోడీకి దూరమై చంద్రబాబు పార్టీ నేతలతో తప్పు చేశామంటున్నారని, మోడీకి దగ్గరవ్వాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: