దగ్గుబాటికి జగన్ ఫైనల్‌గా చెప్పాల్సింది చెప్పేశారు. భార్యాభర్తలు చెరో పార్టీలో కుదరదని తేల్చేశారు. పురంధేశ్వరి పార్టీలోకి వస్తే తగిన గౌరవం ఉంటుందనే హామీ కూడా ఇచ్చారు. congress PARTY YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ హవాలోనూ పర్చూరులో నెగ్గలేకపోయిన దగ్గుబాటికి.. జగన్ తాజా హెచ్చరిక.. సంకటంగా మారింది. 


ఏపీ రాజకీయాల్లో తలపండిన నేత దగ్గుబాటి వెంకటేశ్వర్రావు. ఎన్నికల ముందు అనూహ్యంగా తెరపైకి వచ్చి.. congress PARTY YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ తరపున పర్చూరు బరిలో నిలబడ్డారు. పర్చూరులో టీడీపీకి గట్టిపోటీ ఇచ్చినా.. విజయం మాత్రం సాధించలేకపోయారు. దీంతో అప్పట్నుంచీ రాజకీయంగా సైలంటయ్యారు. అటు పర్చూరు ఇంఛార్జ్ గా దగ్గుబాటి జనంలోకి వెళ్లడం లేదని, మరొకర్ని ఇంఛార్జ్ గా పెట్టాలని కూడా వైసీపీలో ఓ వర్గం జగన్ దగ్గర చెబుతూ వచ్చింది. దగ్గుబాటి భార్య పురంధేశ్వరి బీజేపీలో ఉండటం కూడా ఆయన ప్రత్యర్థులకు వరంలా మారింది. దగ్గుబాటిపై ఫిర్యాదులు రావడంతో.. జగన్ ఆయనతో సమావేశమయ్యారు. 


భార్యాభర్తలు చెరో పార్టీలో ఉంటే కుదురదని దగ్గుబాటి వెంకటేశ్వర్రావుకు సూటిగా చెప్పేశారు జగన్. పురంధేశ్వరిని కూడా పార్టీలోకి తీసుకురావాలని, ఆమెకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో వైసీపీలో దగ్గుబాటి ఫ్యూచర్ బాగుండాలంటే.. పురంధేశ్వరిని తీసుకురావాలని జగన్ చెప్పినట్టైంది. congress PARTY YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ హవాలోనూ పర్చూరులో దగ్గుబాటి గెలవలేకపోవడం కూడా ఆయనకు మైనస్ అయిందనే చెప్పాలి. 


కాంగ్రెస్ హయాంలో పర్చూరులో చక్రం తిప్పిన దగ్గుబాటికి.. ఇప్పుడు పరిస్థితులు ఎదురు తిరిగాయి. మళ్లీ రాజకీయంగా క్రియాశీలం కావాలని ప్రయత్నిస్తున్న తరుణంలో.. ఓటమి ఆయనకు మింగుడు పడటం లేదు. ఇప్పుడు జగన్ కూడా ఏదో ఒకటి తేల్చుకోవాలని చెప్పడంతో దగ్గుబాటి సంకటంలో పడ్డారనే చెప్పాలి. మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పురంధరేశ్వరిని వైసీపీలోకి తీసుకొస్తారా.. లేక ఆయనే బీజేపీ అడుగులు వేస్తారో చూడాలి..మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పురంధరేశ్వరిని వైసీపీలోకి తీసుకొస్తారా.. ఆ ప్రయత్నంతో బీజేపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: